2019లో కేసీఆర్ ఆదేశం.. 2021లో అమలు.. జాప్యం అందుకేనా?

by  |
2019లో కేసీఆర్ ఆదేశం.. 2021లో అమలు.. జాప్యం అందుకేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం హోదాలో ఇచ్చిన ఆదేశాలు అధికారులు పక్కాగా అమలు చేయాల్సిందే. అది కూడా నిర్ణిత గడువులోగా జరిగిపోవాల్సిందే. కానీ ఆర్టీసీ అధికారులకు మాత్రం సీఎం ఆదేశాలను కార్యరూపంలో పెట్టడానికి రెండేళ్ల సమయం పట్టింది. ఇంతకూ సీఎం కేసీఆర్ ఏం ఆదేశించారు..? ఎందుకు జాప్యం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే…

2019లో కేసీఎం కేసీఆర్‌తో ఆర్టీసీ మహిళా కండక్టర్లతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. దీనిలో భాగంగా కొత్త రకం యూనిఫామ్ ఇవ్వాలని కోరారు. వారి అభ్యర్థన మేరకు మహిళా కండక్టర్లకు మెరూన్ కలర్ ఆప్రాన్‌లు అందించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఆర్టీసీలో 4800 మంది మహిళా కండక్టర్లు పని చేస్తున్నారు. వారందరికీ రెండు ఆప్రాన్‌ల చొప్పున అందించాలని నిర్ణయించిన అధికారులు.. అందుకు బ్రాండెడ్ కంపెనీ అయిన రేమండ్స్ వస్త్రాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి 30 వేల మీటర్ల వస్త్రం అవసరమని,రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

అయితే కరోనాతో ఆర్టీసీ సర్వీస్‌లు బంద్ కావడం.. అంతకు ముందు చేసిన సుదీర్ఘ సమ్మెతో నష్టాలు చుట్టుముట్టడంతో సీఎం ఆదేశాలు అమలు కాలేదు. గత 15 రోజులుగా ఆర్టీసీ ఆధాయం పుంజుకుంది. దీంతో మహిళా కండక్టర్లకు మెరూన్ కలర్ ఆప్రాన్‌లు ఇవ్వడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే కంటక్టర్లందరికీ వారి మెజర్ మెంట్ల ఆధారంగా ఆప్రాన్ లు కుట్టి ఇవ్వాల్సి ఉండగా.. కుట్టు కూలీ భారం అవుతుందని భావించి కేవలం రెండు జతలకు సరిపోను రేమండ్ వస్త్రాన్ని మాత్రమే అందిస్తున్నారు. కుట్టు కూలీ కండక్టర్లే భరించాల్సి ఉంటుంది. కాగా ఆర్టీసీలో ప్రతి మూడేళ్లకు ఓసారి రెండు జతల యూనిఫామ్స్ ను అధికారులు సిబ్బందికి ఇస్తారు. కానీ గత ఆరేళ్లుగా వాటి ఊసే ఎత్తడం లేదు. దీంతో సిబ్బందే సొంత ఖర్చులతో కుట్టించుకుంటున్నారు.


Next Story

Most Viewed