జాతర పేరుతో కల్తీ కల్లు.. పలువురికి అస్వస్థత

by  |
జాతర పేరుతో కల్తీ కల్లు.. పలువురికి అస్వస్థత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సంగం గ్రామంలో కల్తీకల్లు కలకలం సృష్టించింది. కల్లు మూస్తేదారు కల్తీ కల్లు విక్రయించడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం గ్రామంలో వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా కల్లు విక్రయాలు పెద్దఎత్తున చేపట్టారు. జాతర కావడంతో కల్లు మూస్తేదారు కల్తీకల్లు విక్రయించారు. పండగ పూట పలువురు కల్తీ కల్లు సేవించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తలనొప్పి, నాలుక మొద్దుబారి పోవడం, ఎక్కడికక్కడ పడిపోయారు. ఉదయం నుంచి అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం బోధన్‌లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కల్తీకల్లు బారిన పడి ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్లు మూస్తే దారులు ఎక్కువ మొత్తంలో కల్లు విక్రయాలు జరిపేందుకు కల్తీ కల్లు తయారు చేసినట్లు సమాచారం. కల్తీకల్లు విక్రయాలు జరిపిన వారి పై ఎక్సైజ్ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులు చెల్లించాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.



Next Story