కళ్లు చెదిరే కొత్త కార్లు!

by  |
కళ్లు చెదిరే కొత్త కార్లు!
X

టోమొబైల్ ఎక్స్‌పో కార్యక్రమంలో దిగ్గజ కంపెనీలన్ని తమ సరికొత్త వాహనాలను ప్రదర్శించాయి. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఎంజీ మోటార్స్, మెర్సిడెజ్ బెంజ్, రెనాల్ట్ వంటి పెద్ద కంపెనీలన్నీ ఒకేచోట కొలువుదీరడంతో ఎక్స్‌పో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎంజీ మోటార్స్, టాటా మోటార్స్ తొలిసారిగా ఈ ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త బీఎస్-6 నిబంధనలు అమలు కానుండటం, అంతర్జాతీయంగా వాతావరణ కాలుష్యానికి సంబంధించి దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఎక్స్‌పో కార్యక్రమంలో కంపెనీలన్నీ ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లకు ప్రాధాన్యత ఇచ్చాయి.


దేశీయ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా వినూత్నమైన, భవిష్యత్తును ఉద్దేశించి ఉత్పత్తి చేసిన వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. ఎక్స్‌పో-2020 కార్యక్రమంలో మహీంద్రా మొత్తం 6 వాహనాలను తీసుకొచ్చింది. మూడు ఎలక్ట్రిక్ వాహనాలను, ఒక కాన్సెప్ట్ కారును, ట్రయో పేరుతో వస్తున్న 3 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శనకు పెట్టింది. అత్యంత జనాదరణ పొందిన ఎలక్ట్రిక్ వెర్షన్ ఈ-ఎక్స్‌యూవీ 300ను సైతం కార్యక్రమంలో ఉంచింది. వీటితో పాటు ఈ-కేయూవి 100 కూడా ఉంది. దీని ధర రూ. 8.25 లక్షలుగా నిర్ణయించింది. ఈ వాహనం ఇండియాలో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనం.


టాటా మోటార్స్ నెక్సన్ ఎలక్ట్రికల్ వాహనం, హారియర్, గ్రావిటాస్ మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది.టాటా మోటార్స్ కంపెనీ విద్యుత్ వాహనాల విభాగాధ్యక్షుడు శైలేస్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం నాలుగు ఉత్పత్తులను ప్రవేశపెట్టారు. రానున్న రెండేళ్లలో మరో నాలుగు వాహనాలను తీసుకొస్తామని చెప్పారు.


అంతర్జాతీయ కంపెనీ ఎంజీ మోటార్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్-ప్రొడక్షన్ మోడల్ మార్వెల్ ఎక్స్‌ను ప్రదర్శనకు ఉంచింది. దీంతో పాటు 360ఏ, విజన్ కాన్సెప్ట్-1, ఈ-ఎమ్‌జీ హైబ్రీడ్ సెడాన్ ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి.
ఇటీవలే దేశీయంగా ఉత్పత్తిని మొదలుపెట్టిన కియా సంస్థ తన సరికొత్త సొనెట్ కారును ప్రదర్శించింది. ఈ వాహనాన్ని మారుతీ సుజుకీ మోడళ్లలో ఉండే విటారా బ్రెజాకు పోటీగా తీసుకొచ్చారు.


ఇక ఫ్రాన్స్ సంస్థ రెనాల్ట్ సరికొత్త ఎలక్ట్రిక్ కారు కె-జీఈ, ట్రైబర్ ఏఎంటీ, ట్విజీ కార్గో వాహనాలను ప్రవేశపెట్టారు. కె-జీఈ వాహనం రేంజ్ 271 కిలోమీటర్లు అందుకుంటుందని సంస్థ తెలిపింది.



Next Story