మరణాన్ని జయించిన ‘మానస’

by  |
Strange disease
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్‌కు చెందిన మానస చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. వింత వ్యాధితో ఆరోగ్యం విషమించిన ఆమెకు నిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు ప్రాణం పోశారు. గత నెల 21న ఆమె డెలివరీ కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. సిజేరియ్ ద్వారా డెలివరీ చేసేందుకు డాక్టర్లు మత్తు మందు ఇచ్చిన తర్వాత శిశువు అవయవాలు బయటకు రాడంతో ఆపరేషన్ చేయకుండానే హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. దాంతో అక్కడి డాక్టర్లు సీజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. అనంతరం మానస పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మహిళా కమిషన్ చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి వెంటనే స్పందించి డాక్టర్లతో మాట్లాడి గతనెల 28న ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఈనెల ఒకటో తేదీన నిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. నిమ్స్ వైద్యులు 18రోజుల పాటు శ్రమించి మానస ప్రాణాలు కాపాడి బిడ్డ దగ్గరకు చేర్చారు. మానసకు గర్భం ధరించిన సమయంలో ఏర్పడ్డ ఒక వ్యాధి వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని నిమ్స్ డాక్టర్ ముకుంద తెలిపారు. తల్లి బిడ్డలు క్షేమంగా తిరిగి ఇంటికి చేరడంతో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, తెలంగాణ మహిళా కమిషన్ సునీతారెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, నిమ్స్ డాక్టర్లు, సిబ్బందికి రోగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.



Next Story