ఆరు వేల అడుగుల ఎత్తున తాడుపై నడక.. వరల్డ్ రికార్డ్ బ్రేక్!

by  |
world record3
X

దిశ, ఫీచర్స్: భూమి నుంచి ఒక మైలు దూరం కంటే ఎక్కువ ఎత్తున ఓ తాడుపై నడిచిన బ్రెజిలియన్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టాడు. బుర్జ్ ఖలీఫా భవనం కంటే రెట్టింపు అంటే దాదాపు 6,131 అడుగుల ఎత్తున, గాలిలో రెండు హాట్ ఎయిర్ బెలూన్స్ మధ్య బిగించిన తాడుపై డేర్‌డెవిల్ రాఫెల్ జుగ్నో బ్రిడి చేసిన సాహసం వీక్షకులను ఆశ్చర్యపరిచింది.

World Record

సవాళ్లను అమితంగా ఇష్టపడే రాఫెల్‌.. నిత్యం అడ్వెంచర్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆకాశంలో రెండు హాట్ ఎయిర్ బెలూన్స్ మధ్య బిగించిన తాడుపై నడిచేందుకు కొన్నేళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. నిజానికి ఇలాంటి ఫీట్స్ చేస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా అది ప్రాణ నష్టానికి దారితీయొచ్చు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని రాఫెల్.. భద్రతా పరంగా అత్యాధునిక సాంకేతికత, ఉత్తమ సహాయక బృందం తో పాటు అత్యుత్తమ పరికరాల విషయాల్లో అన్ని జాగ్రత్తలను తీసుకున్న తర్వాతే ఈ స్టంట్ చేసేందుకు నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్లుగానే రోప్‌పై నడిచి ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేశాడు.

world record2

ఆ భావన మాటల్లో చెప్పలేను..

పర్సనల్‌గా కష్టతరమైన రికార్డులను ఇష్టపడుతుంటాను. నా ప్రాజెక్ట్ అత్యుత్తమంగా ఫినిష్ చేసేందుకు నిరంతరం కష్టపడతాను. రోప్‌పై క్రాసింగ్ చేసే సమయంలో ఏకాగ్రత మొత్తం దానిపైనే కేంద్రీకరిస్తాను. ఏమైనా సందేహాలుంటే, మా బృంద సభ్యులను అడిగి తెలుసుకుంటాను. మబ్బుల మధ్యలో నడుస్తున్నప్పుడు ఆ భావన మాటల్లో చెప్పలేనిది. నేను ఈ ఫీట్ చేస్తున్నప్పుడు స్నేహితులు కూడా చాలా టెన్షన్ పడ్డారు. కానీ నేను పొందిన అద్వితీయ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ క్షణాలు నిజంగా అనిర్వచనీయమైనవి. ప్రొఫెషనల్ అథ్లెట్‌గా నా కెరీర్‌లో కొన్ని ప్రాజెక్ట్ పూర్తిచేయాలని భావిస్తున్నాను. ఆ జాబితాలో ఇదీ ఒకటి.

– డేర్‌డెవిల్ రాఫెల్ జుగ్నో

Read more: స్టేజిపైనే ఏడ్చేసిన అల్లు అర్జున్.. సుకుమార్ గురించి

Next Story

Most Viewed