హాస్పిటల్ బెడ్ పైన కూడా ఏంటా పాడు పని.. సిగ్గు లేదా?

by  |
హాస్పిటల్ బెడ్ పైన కూడా ఏంటా పాడు పని.. సిగ్గు లేదా?
X

దిశ, వెబ్ డెస్క్: పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు అంటారు. కానీ పెద్దయ్యాకా అలవాటైన చెడు వ్యసనాలు కూడా చచ్చేవరకు పోవు అని నిరూపించాడు ఓ వ్యక్తి. వెంటిలేటర్ పై చావు బతుకుల మధ్య పోరాడుతున్నా కూడా తంబాకును చేతిలో రుద్దుతూ కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఓ వ్యక్తి ఆనారోగ్యం కారణంగా అడ్మిట్ అయ్యాడు. అతని పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై పెట్టి చికిత్స అందిస్తున్నారు. అతడు గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో బాధపడుతున్నాడు.

కనీసం గాలి పీల్చుకోవడానికి కూడా ఖాళీ లేనంతగా అతని ముఖం నిండా పైపులను బిగించారు. కానీ ఇవేమి పట్టనట్టు ఆ రోగి చేసిన పని అందరిని విస్మయానికి గురిచేస్తుంది. అంత బాధలో ఉన్నా కూడా అతను చేతిలో తంబాకు(ఖైనీ) వేసుకొని రుద్దుతూ కనిపించాడు. ఇలాండి చెడు వ్యసనాల వలనే ఆసుపత్రి బెడ్ మీద పడ్డాకూడా ఆ రోగి మారకుండా మళ్లీ అదే పని చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛీ.. ఛీ హాస్పిటల్ బెడ్ పైకి ఎక్కినా కూడా ఆ పాడు అలవాటు మానుకోవా? సిగ్గు లేదా ..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Next Story

Most Viewed