‘జేఈఈ, నీట్ పరీక్షల పై సుప్రీంకోర్టుకు వెళ్దాం’

by  |
‘జేఈఈ, నీట్ పరీక్షల పై సుప్రీంకోర్టుకు వెళ్దాం’
X

దిశ, వెబ్‌డెస్క్: జేఈఈ, నీట్ పరీక్షల పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని బెంగాల్ సీఎం మమత బెనర్జీ అన్నారు. బీజేపీయేతర సీఎంలతో సోనియా గాంధీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో బెంగాల్ సీఎం మమత బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పుదుచ్చేరి సీఎం వి. నారాయణ స్వామి, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాగేల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మమత బెనర్జీ మాట్లాడుతూ.. నీట్, జేఈఈ పరీక్షలపై రివ్యూ పిటిషన్ వేయాలని సూచించారు. ఈ పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా లేరని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె వ్యాఖ్యల పై పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ కూడా ఏకీభవించారు. అయితే, సుప్రీంకు వెళ్లే ముందు ప్రధాని, రాష్ట్రపతిని కోరుదామని హేమంత్ సోరెన్ వెల్లడించడం గమనార్హం.



Next Story