పేదలను పీడిస్తున్నారు.. మోడీ ప్రభుత్వంపై మల్లు రవి ఆగ్రహం

by  |
పేదలను పీడిస్తున్నారు.. మోడీ ప్రభుత్వంపై మల్లు రవి ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ధనవంతుల సంక్షేమమే ధ్యేయంగా పేద ప్రజలను పన్నుల పేరిట పీడించి పెద్దల జేబులు నింపుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. సామాన్య ప్రజల నడ్డి విరిచేలా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతోందని, ఇది వారి జీవన గమనాన్ని చిన్నాభిన్నం చేసేలా ఉందని తెలిపారు. పెరిగిన గ్యాస్ ధరలతో ప్రజలు మళ్ళీ కట్టెల పొయ్యిలు వినియోగించాల్సి దుస్థితి రాబోతోందన్నారు. సామాన్య ప్రజలు తమ అవసరాలకు చెట్లు, అడవులను నరికితే పర్యావరణం సమతుల్యం దెబ్బతినదా? అని ప్రశ్నించారు. వెంటనే కేంద్ర, రాష్ట్రాలు తమ పన్నుల వాటాను తగ్గించుకొని పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని మల్లు రవి డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed