‘ఖైదీ’ రీమేక్, సీక్వెల్‌‌పై కేరళ కోర్టు నిషేధం.. ?

by  |
‘ఖైదీ’ రీమేక్, సీక్వెల్‌‌పై కేరళ కోర్టు నిషేధం.. ?
X

దిశ, సినిమా : తమిళ్ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ రోడ్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఫైట్ సీక్వెన్సెస్‌కు స్పెషల్ ఫ్యాన్స్ కూడా ఉండగా.. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌కు ఇండస్ట్రీ ఫిదా అయింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రభు, ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు నిర్మించిన సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారని, అజయ్ దేవగన్ లీడ్ క్యారెక్టర్ చేస్తాడని గతంలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా జరిగింది. అయితే ఈ మధ్య కేరళ కోర్టు ‘ఖైదీ’ రీమేక్, సీక్వెల్‌ను నిషేధించిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఈ కాంట్రవర్సీపై స్పందించారు మేకర్స్. ఈ కేసుకు సంబంధించిన అధికారిక వివరాలు తమకు తెలియదని, దీని మీద మాట్లాడేందుకు సిద్ధంగా లేమని తెలిపారు. ఒకవేళ ఇదే నిజమైతే కోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. కేసు గురించి నిజానిజాలు తెలిసేవరకు నెగెటివ్‌గా రిపోర్ట్ చేయకూడదని మీడియాను అభ్యర్థించారు.


Next Story