27న ఆటోలు బంద్ : JAC నేతలు

by  |
27న ఆటోలు బంద్ : JAC నేతలు
X

దిశ, మహబూబ్ నగర్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 27న దేశవ్యాప్తంగా చేపట్టనున్న భారత్ బంద్‌కు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో యూనియన్ జేఏసీ నేతలు రాములుయాదవ్, బాబుమియా తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆటోల బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నదని ఆరోపించారు. కరోనా మహమ్మారి వల్ల గత రెండేళ్ల నుంచి ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గడంతో కుటుంబపోషణ భారమైందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఆటోలపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. లేబర్ కోడ్లను, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని, నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

27న ఆటోల బంద్‌కు ప్రజలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో జేఏసీ నాయకులు వినయ్ కుమార్, హాప్మి, లింగం, శేఖర్, అంజనేయులు, నరసింహ, ఆంజనేయగౌడ్, ఖాదర్, రాజు, సత్తార్, నదు, మహేష్, సిద్దిఖ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.


Next Story