ఉద్యోగుల డ్రెస్ కోడ్‌పై ‘మహా’సర్కార్ సంచలన నిర్ణయం

by  |
ఉద్యోగుల డ్రెస్ కోడ్‌పై ‘మహా’సర్కార్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల డ్రెస్ కోడ్ పై మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట జీన్స్, టీ-షర్ట్స్, స్లిప్పర్స్‌ను ధరించి రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వారంలో ఒకరోజు ‘ఖాదీ’దుస్తులు ధరించాలని సిబ్బందికి సూచించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి దుస్తువులు ధరించాలనే దానిపై ఒక విధానాన్ని సిద్ధం చేసినట్లు పేర్కొంది.

‘చాలా మంది జాబర్స్, ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగులు మరియు ప్రభుత్వ పనికోసం నియమించబడిన సలహాదారులు ఇన్ని రోజులు తమకు నచ్చినట్లు దుస్తులు ధరిస్తూ వచ్చారు. అందులో జీన్స్ టీషర్ట్స్, స్లిప్పర్స్ ఉండేవి. ఇలాంటి డ్రెస్ కోడ్ వలన ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల మనస్సులలో ప్రతికూల ముద్రను సృష్టిస్తుంది’అని సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకమీదట ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలు చీర, సల్వార్, చుడిదార్-కుర్తా, లేదా చొక్కా, ప్యాంటు మరియు అవసరమైతే దుపట్టా ధరించాలి. పురుషులు ప్యాంటు, చొక్కాలు ధరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా ఉద్యోగులు చెప్పులు లేదా బూట్లు, పురుషులు షూ లేదా చెప్పులు ధరించాలి. అంతేకానీ, స్లిప్పర్స్ ధరించి విధులకు హాజరుకాకూడదు.

చివరగా, ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉద్యోగులు ప్రతీ శుక్రవారం ఖాదీని ధరించాల్సిన అవసరం ఉందని సీఎం ఉద్దవ్ థాకరే తెలిపారు.‘అధికారులు, ఉద్యోగుల వేషధారణ అనుచితమైనది మరియు అపవిత్రమైనదైతే, అది వారి పనితీరుపై కూడా పరోక్ష ప్రభావాన్ని చూపుతుందని మహా సర్కార్ ప్రకటించింది.



Next Story

Most Viewed