- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టిపరిస్థితుల్లో సీబీఐకి బదిలీ చేయం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విషయంలో మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఎట్టిపరిస్థితుల్లో సీబీఐకి బదిలీ చేసేది లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మరోసారి స్పష్టం చేశారు. తామే ఈ కేసును విచారిస్తారని ఆయన అన్నారు. ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖుల స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విషయంలో మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఎట్టిపరిస్థితుల్లో సీబీఐకి బదిలీ చేసేది లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మరోసారి స్పష్టం చేశారు. తామే ఈ కేసును విచారిస్తారని ఆయన అన్నారు.
ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖుల స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై అతని తండ్రి బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. దీంతో ఈ కేసును బీహార్ పోలీసులు విచారిస్తున్నారు. ఓ పోలీస్ బృందం ఇప్పటికే ముంబై చేరుకుని విచారణ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా సుశాంత్ సోదరి స్టేట్‌మెంట్ రికార్టు కూడా చేసింది.
Next Story






