కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న ‘యమరాజు’

by  |
కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న ‘యమరాజు’
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారిని నిరోధించే వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రజలకు టీకా ఆవశ్యకత తెలిపేందుకు అధికారులు పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిఒక్కరూ తమ టర్న్ వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ గురించి తెలిపేందుకు ఇండోర్ పోలీస్ చేసిన విభిన్న ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది.

వ్యాక్సిన్ విషయమై పలు అపోహలు తలెత్తుతున్న నేపథ్యంలో అవన్నీ అసత్యాలని నిరూపించేందుకు గాను అధికారులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వైద్య విభాగ అధికారులు వ్యాక్సిన్ తీసుకుని, దాని ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్, ఇండోర్ సిటీలోని ఓ పోలీస్ ‘యమరాజు’ వేషధారణలో వెళ్లి వ్యాక్సిన్ తీసుకున్నారు. కళ్లద్దాలు, నల్లటి దుస్తులు ధరించి యముడి వేషధారణలో, చేతిలో గద పట్టుకుని వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఈ పోలీస్ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #COVID19Vaccination హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్లు ఈ ఫొటోను పోస్ట్ చేస్తున్నారు.

ఫ్రంట్ లైన్ వర్కర్స్‌తో పాటు సామాన్యులు తమ వంతు వచ్చినపుడు వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేందుకే తాను ‘యముడి’ వేషధారణలో వ్యాక్సిన్ తీసుకున్నానని అతడు తెలిపాడు. కాగా, సృజనాత్మకతతో వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పిస్తున్న ఈ పోలీస్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైమ్‌లో ప్రజలు ఇంట్లోనే ఉండాలని సూచిస్తూ పలువురు దేశవ్యాప్తంగా యముడి వేషధారణలో అవగాహన కల్పించగా, మళ్లీ ఇప్పుడు అదే వేషధారణలో వ్యాక్సిన్‌పై ఓ పోలీస్ అవగాహన కల్పిస్తుండటం విశేషం.



Next Story

Most Viewed