‘అవసరమైతే పదేండ్లు జైళ్లో ఉంటా.. టీఆర్ఎస్‌కు ఆయన సవాల్’

by  |
‘అవసరమైతే పదేండ్లు జైళ్లో ఉంటా.. టీఆర్ఎస్‌కు ఆయన సవాల్’
X

దిశ, మెదక్: నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి మదన్ మోహన్ రావు ఘాటైన విమర్శలు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి 60 ఏండ్ల వయస్సులో జనం సమూహం మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకున్న నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, అవసరమైతే పదేళ్లు జైల్లో ఉండడానికి అయినా సిద్ధమేనని అధికార పార్టీకి సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో కరోనా దరిచేరకుండా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని, మదన్మోహన్ ట్రస్టు ద్వారా సొంత డబ్బులతో స్ప్రై చేస్తున్నట్టు మధన్ మోహన్ రావు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా నివారణలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం నారాయణఖేడ్ పురవీధుల గుండా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తే, తమపై కేసులు నమోదు చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. నాపై ఎన్ని కేసులు పెట్టినా తాను ప్రజల మనిషిని అని ఇలాంటి వాటికి నేనెప్పుడూ భయపడను అంటూ మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి కౌంటర్ విసిరారు. కొవీడ్ 19 నిబంధనలను ఉల్లంఘించి ప్రజల సమూహంలో బర్త్ డే పార్టీ జరుపుకుని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాని అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని తిట్టని తిట్టు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ బీబీ పాటిల్‌కు కూడా గట్టి కౌంటర్ విసిరారు. కరోనా వైరస్‌తో సతమతమవుతూ, ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వారిని ఆదుకోవడంలో ఎంపీ. బీబీ పాటిల్ విఫలం అయ్యారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తి‌పై పోలీస్ స్టేషన్లో కనిపించడం లేదంటూ కేసు నమోదు చేయాలని కోరారు.



Next Story