అదృష్టం అంటే ఆ మహిళదే!

4

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో వరసగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం తడిసి ముద్దయింది. ఎక్కడ చూసినా భారీ వరదలతో సిటీ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో పురాతన, పాత భవనాలు నేలమట్టం అవుతున్నాయి. బుధవారం సాయంత్రం పాతబస్తీలో ఓ భవనం కుప్పకూలింది. ఈ సమయంలో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.

శాలిబండలోని ఓ పాత ఇల్లు కుప్పకూలింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. భవనం కూలుతున్న సమయంలో ఓ మహిళ దాని ముందు నుంచే నడుచుకుంటూ వెళ్తోంది. భవనం నేలమట్టం అవుతున్న దృశ్యాలను చూసిన మహిళ.. పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడింది. అటుగా వచ్చే వాహనాలు సైతం నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ లో
రికార్డు కావడంతో వైరల్ గా మారాయి.