‘లవ్ స్టోరి’ సినిమా విడుదల వాయిదా..

96
Love story

దిశ, సినిమా: కరోనా తీవ్రత నేపథ్యంలో ‘లవ్ స్టోరి’ సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. హైదరాబాద్ గచ్చిబౌటి ఏఎంబి థియేటర్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన మేకర్స్.. త్వరలోనే మరో రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నారు. వీలైనంత త్వరగా మంచి డేట్ చూసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా.. పవన్ సిహెచ్ సంగీతం సమకూర్చారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..