‘లవ్ స్టోరి’కి కనెక్ట్ అయ్యారు : శేఖర్ కమ్ముల

48

దిశ, వెబ్‌డెస్క్: ‘లవ్ స్టోరి’ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించడంపై సంతోషంగా ఉందన్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. 24 గంటల్లో ఆరు మిలియన్ ప్లస్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టీజర్‌లో హీరో, హీరోయిన్ల క్యారెక్టర్స్ రివీల్ చేశామని తెలిపారు. దీనికి ఆడియన్స్ కనెక్ట్ కావడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఊరు నుంచి సిటీకి వచ్చి సెటిల్ అయ్యే యువకుడిగా చైతు చాలా సింపుల్‌గా కనిపించారని.. తనను ఈ సినిమాలో చాలా కొత్తగా చూస్తారన్నారు. ‘లవ్ స్టోరి’ కోసం చైతు పడిన కష్టానికి మంచి ఫలితం దక్కుతుందన్న శేఖర్ కమ్ముల.. సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు షేర్ చేస్తామన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..