కరోనాలో మొదట కనిపించే లక్షణమిదే!

by  |
కరోనాలో మొదట కనిపించే లక్షణమిదే!
X

దిశ, వెబ్‌డెస్క్:

కరోనా వైరస్ సోకితే మొదట జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం వస్తాయని నిన్నటి వరకు అనుకున్నారు కానీ వీటన్నిటికంటే ముందు కనిపించే వ్యాధి లక్షణాన్ని డాక్టర్లు కనిపెట్టారు. కరోనా సోకిన తర్వాత ముక్కుకు వాసన జ్ఞానం పోతుందని వారు తెలిపారు. బ్రిటిష్ రైనలాజికల్ సొసైటీకి చెందిన డాక్టర్లు ఈ పరిశోధన చేశారు. తీపి, పులుపుతో పాటు చెడు, ఘాటు వాసనలను కూడా ముక్కు గ్రహించలేని పరిస్థితి ఏర్పడినపుడు సంబంధిత వ్యక్తులు తమను తాము సెల్ఫ్ ఐసోలేట్ చేసుకోవాలని ప్రొఫెసర్ క్లెయిర్ హాప్కిన్స్ తెలిపారు. దీంతో వ్యాధి వ్యాప్తి తగ్గే అవకాశం ఉందని ఆమె అన్నారు.

కేవలం జలుబు, జ్వరం వచ్చిన వారికి మాత్రమే కాకుండా వాసన జ్ఞానం కోల్పోయిన వారికి కూడా ట్రీట్ చేసే మాస్క్ తప్పకుండా ధరించాలని బ్రిటన్‌లో ముక్కు, గొంతు, చెవి డాక్టర్లకు రైనాలజీ సొసైటీ సూచనలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ వైరస్ ఎక్కువగా ముక్కులోని సైనస్ భాగాల్లో రెట్టింపు స్థాయిలో వృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నందున తుమ్ము దగ్గులను వీలైనంత మేరకు నిరోధించాలని పేర్కొన్నారు. చైనాలో కూడా ముక్కు, గొంతు, చెవి డాక్టర్లే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడి మరణించినట్లు క్లెయిర్ వెల్లడించారు. అనొస్మియాగా పిలిచే ఈ పరిస్థితి చాలా మంది కరోనా బాధిత పేషెంట్లలో కనిపించిన మొదటి లక్షణమని ఆమె చెప్పారు. మొదట వాసన జ్ఞానం, తర్వాత రుచి చూడగల శక్తిని కోల్పోతారని క్లెయిర్ వివరించి చెప్పారు. ఇటలీలో కూడా కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లలో మొదట జలుబు, జ్వరం కనిపించలేదు కానీ వాసన జ్ఞానం కోల్పోయారు. అది పట్టించుకోకుండా వారు తిరగడం వల్లే వైరస్ ఎక్కువమందికి వ్యాపించిందని క్లెయిర్ స్పష్టం చేశారు.

Tags : Corona, COVID, Smell sensation, Anosmia, taste, ENT, Italy, China

Next Story

Most Viewed