లాక్‌డౌన్ ఎఫెక్ట్: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

by  |
local elections
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం ఓటరు జాబితాను సిద్ధం చేస్తోంది. ఈ నెల 15న తుది జాబితాను విడుదల చేసి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. కానీ రాష్ట్రంలో కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారధి ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా మరో ఏడాది పాటు ఎక్కడా ఎన్నికలు నిర్వహించమంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

వాస్తవానికి రాష్ట్రంలో 97 సర్పంచ్​లు, 1,083 వార్డు స్థానాలు, రెండు ఎంపీపీలు, ఒక జెడ్పీటీసీ, 24 ఎంపీటీసీ, 20 గ్రామ పంచాయతీల్లో మొత్తం స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనికోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఓటరు జాబితాపై షెడ్యూల్​జారీ చేసింది. ఇప్పటికే పురపాలిక ఎన్నికలను నిర్వహించిన ఎస్ఈసీ… పంచాయతీ ఎన్నికలను కూడా కంప్లీట్​ చేయాలని భావిస్తోంది. కానీ కరోనా ఆంక్షలు ఎన్నికలకు బ్రేక్​ వేశాయి.


Next Story

Most Viewed