- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
పర్యావరణం మానవాళికి ఎంతో ముఖ్యం
అది ప్రకోపిస్తే మన బ్రతుకులు అగమ్యగోచరం!
నాణ్యమైన విత్తనాల కోసం తప్పదు సమరం
సకాలంలో యూరియా అందితే అదో సంబురం!
రైతన్నలు శ్రమిస్తేనే మనకు నిత్యం ఆహారం
ఆరుగాలం కష్టపడే వారికి దక్కేది ఏమాత్రం!
భూమాతను నమ్ముకునే అమాయక ప్రాణులు!
వట్టిపోయిన బోరుబావులతోనే వారికి దిగులు
సకాలంలో వరుణుడు కరుణిస్తేనే వారికి మేలు!
పంటచేతికొచ్చే సమయానికే అకాల వర్షాలు
తడిసిన ధాన్యం అమ్మేందుకు తప్పవు తిప్పలు!
మార్కెట్ యార్డుల్లో దళారుల మాయాజాలం
తరుగు పేరుతో మిల్లు యజమానుల హస్తలాఘవం!
అన్నదాతల కష్టానికి ఏమిటి ప్రతిఫలం
వ్యవసాయం ఏ విధంగా లాభదాయకం!
-యేచన్ చంద్ర శేఖర్
8885050822
- Tags
- Poem
Next Story






