- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ముదిరిన పచ్చదనం
భారంగా తరువునిడిచింది
ఒకే తనువుగా
పత్రహరితంతో శ్వాసించి
కొత్త చిగురులకు దారినిచ్చింది
తరువుకు అదనుగా
సారమైన పండుటాకు
తన జాడ నుండే
మారాకును పొదిగింది
రాలిపోతూ...
కొత్త ఆశలకు అంటుగా
హామి పత్రంగా...
పరిఢవిల్లిన పచ్చదనం
కొమ్మలు రెమ్మలుగా...
విత్తనంగా...
మళ్లీ పుడమిలోకి
నూతనూత్తేజంగా
-బి. వేణుగోపాల్ రెడ్డి
99081 71441
- Tags
- Poem
Next Story






