- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
గర్భగుడి వెలుపల
మొదటి ప్రార్థనగా
నిలిచినవాడు తండ్రి...
మన అడుగులకు
దారి వేయాలని
తన పాదాలను రాళ్లపై
పరచుకున్న వాడు.
చెమట చుక్కలతో
కలల పొలాన్ని తడిపి,
మన భవిష్యత్తును
పంటగా పండించిన రైతు.
ఇంటి దీపం ఆరిపోకూడదని
తన జీవితాన్నే వత్తిగా
కరిగించిన దీపస్తంభం.
కన్నీటి భాష తెలిసినా
నవ్వుల లిపిలోనే
మాట్లాడిన మౌన కవి.
తన కోరికల సమాధిపై
మన ఆశల రాజగోపురం
కట్టిన త్యాగశిల్పి.
ఆకాశమంత ప్రేమను
గుండెలో దాచుకుని
చూపుల్లో మాత్రం
క్రమశిక్షణను నింపిన గురువు.
తండ్రి...
ఒక వ్యక్తి కాదు,
కాలం రాసిన మమతా వేదం;
జీవితం పలికిన
అత్యంత అందమైన
మౌన మహాకావ్యం.
-వలిపి శ్రీరాములు
94411 35762
- Tags
- Poem
Next Story






