కుటుంబం

by Disha edit |
కుటుంబం
X

కుటుంబం మనిషి మనుగడకు

ఆలంబనం

జీవులన్నింటికీ సహజం సహజీవనం

కుటుంబం మానవతకు గీటురాయి

మానవతను చాటే కలికి తురాయి

బ్రతుకు భద్రతకు భరోసా

కుటుంబం ఒక సాగరం

అలలు సహజమే!

అవి ఒడ్డుకు చేరవేయడానికే కదా !

ఆధునిక నాగరికత నీడలో

కుటుంబం విచ్చిన్నమవుతున్నది

రెక్కలొచ్చి పక్షులు ఎగిరిపోతుంటే

గూళ్ళు చిన్న బోతున్నవి!

ఒంటరి అయిన వృద్ధ పక్షులు

కలికాలం అని విలపిస్తున్నవి!

గాలిలో ఎగిరిపోతున్నామని

సంబరపడుతున్నవే కానీ

ఎప్పటికైనా వాలి పోవాల్సిందే

అనే విషయం మరిచిపోతున్నాయి!

కుటుంబం అంటే వటపత్రం

ప్రళయంలో విష్ణువును రక్షించలేదా!

కుటుంబం నిన్ను కాపాడే ఛత్రం

కుటుంబం అంటే

అమ్మానాన్నలు తాత నానమ్మలు

పెద్ద నాన్న చిన్న నాన్న

అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ

బంధమే కాదు

ఊరంతా అనుబంధం

జగమంతా జన బలగం

పి. బక్కారెడ్డి

97053 15250


Next Story

Most Viewed