సమీక్ష: 'మాకథలు' వంటివి తెలంగాణ నుంచి ఎప్పుడు?

by Disha edit |
సమీక్ష: మాకథలు వంటివి తెలంగాణ నుంచి ఎప్పుడు?
X

మా కథలు' వంటివి తెలంగాణ నుంచి ఎప్పుడు వస్తాయి? 'మా కథలు' ఆవిష్కరణ సభలో పాల్గొన్న తర్వాత ఈ ఆలోచన ముందుకు వచ్చింది. 43 మంది సుప్రసిద్ధ కథకులతో, యువ రచయితల కథలతో వెలువడిన ఈ కథల సంకలనం ఆవిష్కరణ 14 అక్టోబర్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి మినీ హాలులో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సింహప్రసాద్‌ సాహిత్య సమితి సంయుక్త నిర్వహణలో చక్కగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ముఖ్య అతిథిగా రాగా, సుప్రసిద్ద సీనియర్‌ రచయిత విహారి అధ్యక్షత వహించారు.

ఈ సభలో ఆకెళ్ల సుబ్బులక్ష్మి గారికి బాల సాహిత్య పురస్మారం, బహుశా వేణుగోపాల్‌ గారికి యువ కథా పురస్మారం అందజేశారు. వేదగిరి రాంబాబు కథా సాహిత్యం మీద వక్తలు చక్కగా ప్రసంగించారు. తెలంగాణ సాహిత్యానికి అయిదు జిల్లాల కోస్తాంధ్ర సాహిత్యానికి వస్తువు శిల్పంలో, సమాజ పరిణామంలో గల తేడాను సోదాహరణంగా నేను వివరించారు. తెలంగాణ అస్తిత్వం కథలో వాటి ప్రతిఫలనం గురించిన ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. అదేరోజు సాయంత్రం ఎందుకో కవి, సంపాదకుడు సామిడి జగన్‌రెడ్డి గారు ఫోన్‌ చేశారు. ప్రసంగం విశేషాలను వివరిస్తూ సంభాషణ సాగింది. అందులోని ముఖ్యాంశాలకు ఈ వ్యాసం పరిమితం.

*

పందొమ్మిది వందల ముప్పై నుండి పందొమ్మిది యాభై, యాభై ఐదు దాకా కోస్తా ఆంధ్రాలోని ఐదు జిల్లాల సాహిత్యంలో ఆధునిక సమాజంలో తొలితరం నుండి విద్యావంతులుగా, ఉద్యోగులుగా, మధ్య తరగతిగా ఎదుగుతున్న క్రమం చక్కగా చిత్రించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు రావడం, పల్లెల్లోని తమ కులంలో మధ్య తరగతిగా ఎదగకుండా ఉండిపోయిన వారితో గల సంబంధ బాంధవ్యాలు, వాటి తాలూకు బాధ్యతలు, మధ్య తరగతిపై కొనసాగుతూ వచ్చాయి. కొడవటిగంటి కుటుంబరావు వంటివారి కథలతో, నవలలలో వీటిని చూడవచ్చు. ఆ కాలంలో వచ్చిన సినిమాలలో కూడా ఎదుగుతున్న మధ్య తరగతికి, ఎదిగిన మధ్య తరగతికి, ఎదగాలనుకుంటున్న మధ్య తరగతికి, మధ్య తరగతిగా ఎదగాలని ఆశతో ఎదగలేకపోతున్న మధ్య తరగతి గురించి సంబంధాలు, ఉమ్మడి కుటుంబాలు, కులాలు, సమాజాలు చిత్రించబడ్డాయి.

క్రమంగా మధ్య తరగతి తనలాగ తొలితరం నుండి ఎదగలదలచుకున్నవారికి చేయూత నందించడం అనే బాధ్యతను వదిలించుకుంటూ వస్తున్నారు. అలా ఉమ్మడి కుటుంబాలు, వ్యక్తి కుటుంబాలుగా మారిపోయాయి. ఎదిగిన మధ్య తరగతి తమలో తాము సంబంధాలు పెట్టుకొని ఒక ప్రత్యేక మధ్య తరగతి సామాజిక వర్షంగా ఎదుగుతూ వస్తున్నది. ఈ 'కమాన్ని యద్దనపూడి సులోచనారాణి, ఆరికెపూడి కౌసల్యాదేవి తదితరుల నవలల్లో చూడవచ్చు. ఆ తర్వాత టీవీలు, సినిమాలు, కోస్తాంధ్ర రచయితలు ఇదే పద్దతి కొనసాగిస్తున్నారు.

*

తెలంగాణ పరిస్థితి ఇందుకు భిన్నంగా కొనసాగుతున్నది. నిజాం పాలనలో తెలంగాణ సమాజం మధ్య తరగతిగా ఎదిగిన తీరు ప్రత్యేకమైనది. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి వంటి ప్రాంతాలకు వలసవెల్లి కార్మికులనుండి మధ్య తరగతిగా ఎదుగుతూ వస్తున్న క్రమం ప్రధానంగా చూడవచ్చు. మధ్య తరగతి విద్యావంతుల నుంచి ఉద్యోగుల నుంచి ఎదగడం చాలా తక్కువ. దీనికి కారణం నిజాం ఉదారంగా ఉత్తరాదినుంచి, దక్షిణాది నుంచి ఎవరు వచ్చినా వారందరికి పెద్ద పీట వేయడం. 1948 సెప్టెంబర్‌ 17 పోలీసు యాక్షన్‌ తర్వాత వెల్లోడి ముఖ్య అధికారిగా ఉంటూ మద్రాసు రాష్ట్రం నుంచి లక్షలాది మందిని ఇక్కడ ఉద్యోగాలో, ఇతర రంగాలలో నియమించారు.

దానితో ఆంధ్రాకు యాభై శాతం, తెలంగాణాకు యాఖై శాతంగా ఎదగాల్సిన మధ్య తరగతిలో తెలంగాణా అవకాశాలు 30 శాతందాకా ఆంధ్రావాళ్లు తీసుకున్నారు. ఆంధ్రా మధ్య తరగతి ఎనభై శాతంగా ఎదుగుతూ వచ్చింది. తెలంగాణ మధ్య తరగతి 20 శాతానికి కుదించుకుపోతూ వస్తున్నది. పైగా తెలంగాణాలో కుల వృత్తుల నుండి, కుల వృత్తి ఆధారిత వ్యాపారాలు చేస్తూ మధ్య తరగతిగా ఎదిగే క్రమం కొనసాగుతూ వస్తున్నది. అందువల్ల తెలంగాణ మధ్య తరగతి ఎదుగుదల ప్రత్యేక సామాజిక చరిత్ర. తెలుగు కథల్లో ఆంధ్రా మధ్య తరగతి, తెలంగాణ మధ్య తరగతి కథల చిత్రీకరణలో ఈ వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం చరిత్రాత్మకమైనది.

*

వంద దాకా కథలకు, నవలలకు బహుమతులు పొందిన సింహ ప్రసాద్‌గారికి నేను విశాలసాహిత్య అకాడమీ తరఫున పురస్కారాలకు ఎంపిక చేద్దామంటే కుదరలేదు. కారణమేమంటే తొలితరం నుండి మధ్య తరగతిగా ఎదుగుతున్న తెలంగాణ సామాజిక పరిణామాల చిత్రణ, ఆయా కులవృత్తుల నుండి ఎదుగుతున్న క్రమం, వారికి విద్యావంతులైన మధ్య తరగతికి తేడాలు, సంబంధాలు, బాధ్యతలు గురించిన చిత్రణ కొరవడింది. తెలంగాణ జీవితాలు ఆంధ్రావారికి అర్ధం కాకుండా పోయాయి. తెలంగాణ ఏర్పడ్డప్పటికీ హైదరాబాద్‌లో ఆంధ్రా రచయితలు సహకార పద్ధతిలో కథా సంపుటాలు తీసుకు రావడానికి తెలుగు కథా రచయితల వేదిక పూనుకున్నది.

ఇలా తెలంగాణాలోని అందరి కథలు అచ్చువేసే విధానాన్ని కొనసాగించడం లేదు. నేనీ ఈ ప్రయత్నం చేసినప్పుడు చనిపోయిన వారి కథలు వేసిన. బతుకు నవల కథలు వేసినప్పుడు ఇవ్వగలిగినవారిని ఆర్థిక సౌజన్యం అందించాలని కోరితే ఒక రచయిత 'పైసలిచ్చి నా కథ అచ్చు వేయించుకోనవసరం లేదు అని అన్నాడు. బాధపడ్డాను. జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి తమ కథ అచ్చయిన సంబరంతో సభకు వచ్చిన వారికి కనీసం వేదికపై గ్రూపు ఫోటో ఉండాలి. ఆ గ్రూపు ఫోటోను కొన్ని దశాబ్దాలపాటు తమ చరిత్రలో భాగంగా, సాహిత్య చరిత్రను ముందుకు తీసుకుపోతారు.


బీఎస్‌. రాములు

83319 66987

Next Story

Most Viewed