సంప్రదాయం: ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ

by Disha edit |
సంప్రదాయం: ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
X

ఈ అమావాస్య నాడు ప్రకృతి ఒడిలో పూసిన అడవి పూలను తప్పెటలో అలంకరించి చిన్న బతుకమ్మగా పిలుచుకుంటారు. భాద్రపద బహుళ అమావాస్య నాడు ప్రారంభమైన చిన్న బతుకమ్మను ఆశ్వయుజ మాస శుద్ధ మహర్నవమి నాడు 'శ్రీ సద్దుల బతుకమ్మ'గా ఘనంగా జరుపుకుంటారు. పెత్తరమాసనాడు శిబ్బిలో తీర్చిదిద్దబడిన చిన్న బతుకమ్మ తొమ్మిదవ రోజున తాంబూలంలో 'సద్దుల బతుకమ్మ'గా దర్శనమిస్తుంది. గుమ్మడి ఆకులు, గుమ్మడి పూలతో పాటు, అడవి పూలు అయిన తంగేడు, గునుక పూలు, గడ్డిపూలు, అడవి చామంతులు, కట్లె పూలు రుద్రాక్ష పూలు, పున్నాగలు, బంతులు, పొక బంతులు దరిసెన పూలు ఎన్నింటినో ఏరి తెచ్చి తొలుత తల్లిగారిని తలుచుకొని తంగేడు పువ్వెట్టి, అత్తగారిని తలిలుచుకుని గునుక పువ్వెట్టి వరుసలుగా పేరుస్తూ బతుకమ్మను అలంకరిస్తారు.

పెద్దలకు వచ్చింది ఉయ్యాలో-పెత్తరమాస ఉయ్యాలో, చిన్నలాకొచ్చింది ఉయ్యాలో-చిన్న బతుకమ్మ ఉయ్యాలో' అంటూ సాగే బతుకమ్మ పాటలు తెలంగాణ ప్రజల సాంస్కృతిక వైభవానికి నిలువెత్తు నిదర్శనం. ప్రపంచంలో భారతదేశం ఒక ప్రత్యేక సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్నది. అందులోనూ తెలంగాణలో సాంస్కృతిక వైభవం విభిన్నం. ప్రత్యేకం. ఇక్కడి ప్రజల జీవన విధానం నుంచి ఎన్నో ఆటలు, పాటలు, పండుగలు పుట్టుకొచ్చాయి. అవన్నీ కూడా ప్రకృతి ఆధారితంగా ఉన్నాయి.అలాంటి పండుగలలో 'బతుకమ్మ' ముఖ్యమైనది.

బతుకమ్మ పాటలు భారతీయ ఇతిహాసాలు, తెలంగాణ ప్రజల జీవన విధానం, తెలంగాణ కుటుంబ నేపథ్యాన్ని ప్రపంచానికి చాటుతూ ప్రసిద్ధి చెందాయి. భాద్రపద మాస బహుళ అమావాస్యను మహాలయ అమావాస్యగా, వాడుకలో పెత్తరమాసగా జరుపుకుంటారు. ఈరోజునే 'చిన్న బతుకమ్మ'గానూ జరుపుకుంటారు.

మహిళ గొప్పదనం

ఈ అమావాస్య నాడు ప్రకృతి ఒడిలో పూసిన అడవి పూలను తప్పెటలో అలంకరించి చిన్న బతుకమ్మగా పిలుచుకుంటారు. భాద్రపద బహుళ అమావాస్య నాడు ప్రారంభమైన చిన్న బతుకమ్మను ఆశ్వయుజ మాస శుద్ధ మహర్నవమి నాడు 'శ్రీ సద్దుల బతుకమ్మ'గా ఘనంగా జరుపుకుంటారు. పెత్తరమాసనాడు శిబ్బిలో తీర్చిదిద్దబడిన చిన్న బతుకమ్మ తొమ్మిదవ రోజున తాంబూలంలో 'సద్దుల బతుకమ్మ'గా దర్శనమిస్తుంది.

గుమ్మడి ఆకులు, గుమ్మడి పూలతో పాటు, అడవి పూలు అయిన తంగేడు, గునుక పూలు, గడ్డిపూలు, అడవి చామంతులు, కట్లె పూలు రుద్రాక్ష పూలు, పున్నాగలు, బంతులు, పొక బంతులు దరిసెన పూలు ఎన్నింటినో ఏరి తెచ్చి తొలుత తల్లిగారిని తలుచుకొని తంగేడు పువ్వెట్టి, అత్తగారిని తలిలుచుకుని గునుక పువ్వెట్టి వరుసలుగా పేరుస్తూ బతుకమ్మను అలంకరిస్తారు. అటు పుట్టింటికి, ఇటు మెట్టినింటికి బతుకమ్మ పండుగ పరిమళాలను వెదజల్లుతూ రెండు కుటుంబాలను అనుసంధానం చేస్తారు. సద్దుల బతుకమ్మను తెలంగాణలోనే కాకుండా ప్రపంచంలోని తెలంగాణ ప్రజలంతా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ ఆద్యంతం మహిళల మనసులను ఉత్సాహంతో నింపుతుంది.

పాటలో తెలంగాణ

రంగురంగుల పట్టు చీరలతో, చప్పట్లు కలుపుతూ, గాజుల గల గల మధ్య, మువ్వల సవ్వడి మధ్య ఉయ్యాల పాటలతో సాగే ఈ బతుకమ్మ దృశ్యం కన్నుల పండుగగా ఉంటుంది. కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి ఈ తొమ్మిది రోజులలో మూడు రోజులు పసుపుతో గౌరమ్మను చేసి చెరువులో నిమజ్జనం చేసి, సౌభాగ్యాన్ని, సౌఖ్యాన్ని కోరుకుంటారు. చెరువు గట్టున పాడే గౌరమ్మ పాటలు. బతుకమ్మ పండుగలో మరీ ప్రత్యేకంగా ఉంటాయి.

'ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ' అనే పాటలతో పాటు మహిళా గొప్పతనాన్ని తెలుపుతూ తమ కుటుంబ జీవనంలో ఎలా మసలుకోవాలో తెలిపే పాటలు కూడా ఈ వేడుకలలో పాడుతారు. సద్దుల బతుకమ్మ రోజున ఆటలు ఆడి, ఉయ్యాల పాటలు పాడి తెలంగాణ చరిత్రకు వారసులుగా నిలుద్దాం. బతుకమ్మ పండుగ మట్టి విలువను, పర్యావరణ విలువను మానవ జీవనంతో మమేకం చేస్తూ ఆనందకర, ఆరోగ్యకర మానవ జీవనానికి దారి చూపిస్తుంది.

(నేడు సద్దుల బతుకమ్మ)


లక్కిరెడ్డి విజయశుభాకర్ రెడ్డి

93936 65222

Next Story

Most Viewed