మీ ఫోన్ హ్యాక్ అవుతుందనే భయం వెంటాడుతుందా? ఈ సింపుల్ సీక్రెట్ కోడ్‌తో మీరు సేఫ్..

by Dishafeatures3 |
మీ ఫోన్ హ్యాక్ అవుతుందనే భయం వెంటాడుతుందా? ఈ సింపుల్ సీక్రెట్ కోడ్‌తో మీరు సేఫ్..
X

దిశ, ఫీచర్స్:ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతీ ఒక్కరికి ఇంపార్టెంట్ అయిపోయింది. కేవలం కాల్స్, చాట్స్ మాత్రమే కాకుండా పేమెంట్స్, క్యాబ్ బుకింగ్ వంటి యూజ్‌ఫుల్ థింగ్స్ కూడా ఉండటంతో మొబైల్ తప్పకుండా యూజ్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ ఇంపార్టెన్స్‌నే క్యాష్ చేసుకుంటున్నారు హ్యాకర్స్. ఫోన్‌లో డేటా దొంగలించడమే కాదు బ్యాంక్ ఎకౌంట్ వంటి సీక్రెట్ డిటెయిల్స్ కూడా చొరీ చేస్తున్నారు. అందుకే తమ ఫోన్ హ్యాక్ అవుతుందనే భయం చాలా మందిని వెంటాడుతుండగా.. ఈ ఆందోళన నుంచి రక్షించుకునేందుకు కొన్ని USSD కోడ్స్ షేర్ చేసింది నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఈ ఆల్ఫా న్యూమెరిక్ కోడ్స్‌తో మీరు సేఫ్‌గా ఉండొచ్చని తెలిపింది. ఇంతకీ ఆ కోడ్స్ ఏంటి? ఎలా యూజ్ చేయాలి?

1. *#21# – ఈ కోడ్ మీ కాల్ లేదా ఫోన్ నంబర్ ఏదైనా ఇతర నంబర్‌కి ఫార్వార్డ్ చేయబడిందో లేదో తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ మధ్య ఎక్కువగా నమోదవుతున్న కాల్-ఫార్వర్డ్ స్కామ్‌లను నివారించడానికి ఇది తెలుసుకోవడం చాలా అవసరం.

2. #0# - ఈ కోడ్‌ని ఉపయోగించడం వలన ఫోన్ డిస్‌ప్లే, స్పీకర్, కెమెరా, సెన్సార్ సరిగ్గా పని చేస్తున్నాయో లేదో తెలుస్తుంది.

3. *#07# – మీ ఫోన్ SAR వాల్యూ వంటి వివరాలను ఈ USSD కోడ్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. పరికరం నుంచి వెలువడే రేడియేషన్ సమాచారం పొందవచ్చు.

4. *#06# – ఈ USSD కోడ్ మీ ఫోన్ IMEI నంబర్‌ను అందిస్తుంది. మీరు సెల్ పోగొట్టుకున్నప్పుడు, పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు ఈ నంబర్ ఉపయోగపడుతుంది.

5. ##4636## - ఈ కోడ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ, ఇంటర్నెట్, Wi-Fi గురించిన గ్రాన్యులర్ డీటెయిల్స్ అందిస్తుంది.

6. ##34971539## – ఈ కోడ్‌ని ఉపయోగించి మీరు మీ ఫోన్‌లోని కెమెరా సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేయవచ్చు.

7. 2767*3855# - మీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయడానికి ఈ రిస్కీ కోడ్ యూజ్ అవుతుంది.అంటే మీరు ఫోన్‌లోని డేటాను బ్యాకప్ చేయకపోతే.. ఈ USSD కోడ్‌ని డయల్ చేయడం ద్వారా పూర్తి డేటా కోల్పోతారు.



Next Story

Most Viewed