'ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ICF)' స్థాపన

by Disha Web Desk 7 |
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ICF) స్థాపన
X

దిశ, ఫీచర్స్: 'ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ICF)' 1955 అక్టోబర్ 3న స్థాపించబడింది. తమిళనాడులోని పెరంబూర్‌లో ఏర్పాటైన ఈ కంపెనీ రైల్వే కోచ్‌లను తయారు చేస్తుంది. ఇండియన్ రైల్వేస్ మొత్తం నాలుగు రేక్ ఉత్పత్తి యూనిట్లను కలిగివుండగా అందులో ICF ఒకటి. మిగిలిన మూడు రాయ్‌బరేలిలోని మోడరన్ కోచ్, కపుర్తలాలోని రైల్ కోచ్, లాతూర్‌లోని మరఠ్వాడా రైల్ కోచ్ ఫ్యాక్టరీలుగా ఉన్నాయి.

ఇక ICF ప్రధానంగా భారతీయ రైల్వేల కోసం రోలింగ్ స్టాక్‌ను తయారు చేస్తూనే.. ఇతర దేశాలకు రైల్వే కోచ్‌లను ఎగుమతి చేస్తుంది. ఈ క్రమంలో 2017-2018 ఆర్థిక సంవత్సరంలో 2,503 కోచ్‌లను ఉత్పత్తి చేసి కొత్త రికార్డ్ నెలకొల్పింది. అంతేకాదు 2009-2010లో 1,437 కోచ్‌ల నుంచి 2018-2019 ఆర్థిక సంవత్సరం వరకు 3,262 కోచ్‌లను తయారు చేసి విడుదల చేయడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే కోచ్ తయారీదారుగా అవతరించింది. వీటిలో లింక్-హాఫ్‌మన్-బుష్(LHB), ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్స్(EMU) వంటి స్వీయ-చోదక రైలు సెట్‌లు(SPTs) కూడా ఉన్నాయి.


Next Story

Most Viewed