ఏ రుద్రాక్ష దేనికి సంకేతం..? అసలు రుద్రాక్షను ధరించవచ్చా..?

by Disha Web |
ఏ రుద్రాక్ష దేనికి సంకేతం..? అసలు రుద్రాక్షను ధరించవచ్చా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : రుద్రాక్ష. ఇది హిందువులకు ఆరాద్య దైవం. దీనిని పరమ శివుడికి ప్రతీకగా కొలుస్తారు. రుద్రాక్ష అనేది మాగ్నోలియోఫైటాకు చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం Elaeocarpus Ganitrus. రుద్ర+అక్ష = రుద్రాక్ష. రుద్రుని (శివుడు) అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారాయని పూర్వికుల నమ్మకం. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. పూర్వం ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించేవారని పురాణా గ్రంధాల ద్వారా తెలుస్తున్నది. ఇప్పటికీ బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువులు వీటిని ధరిస్తారు. ధరించడం వీలుకాని వారు పూజా మందిరాల్లో ఉంచి పూజిస్తారు. రుద్రాక్షలలో పలు రకాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరుగుతాయా. రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు కోడిగుడ్డు, ఒక కాయ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుచించుకుంటూ గుండ్రంగా మారుతాయి. దీని మధ్య భాగంలో కల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య ఖాళీ ఏర్పడి దారం గుచ్చేందుకు వీలు కలుగుతుంది.

రుద్రాక్షాలు ఎన్ని రకాలు ఉన్నాయి..?

రుద్రాక్షాలను ముఖముల సంఖ్యాపరంగా విభజిస్తారు. ఇవ్వి ఒక ముఖము నుండి పన్నెండు, పదిహేను ముఖాల వరకూ కలిగి ఉంటాయి. ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు కూడా ఉంటాయి. మార్కెట్‌లో అత్యధికంగా పంచముఖ రుద్రాక్షలు లభిస్తాయి. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెపుతారు. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరుతుందని నమ్ముతారు.

ఏకముఖి రుద్రాక్ష (ఒక ముఖము కలిగినది).

ఇది అత్యంత శ్రేష్టమైనది. శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా నమ్ముతారు.

ద్విముఖి రుద్రాక్ష (రెండు ముఖములు కలిగినది).

దీనిని శివపార్వతి రూపంగా భావిస్తారు.

త్రిముఖి రుద్రాక్ష (మూడు ముఖములు కలిగినది).

దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు.

చతుర్ముఖి రుద్రాక్ష (నాలుగు ముఖాలు కలిగినది).

నాలుగు వేదాల స్వరూపం

పంచముఖి రుద్రాక్ష (అయిదు ముఖాలు కలిగినది).

పంచభూత స్వరూపం

షట్ముఖి రుద్రాక్ష(ఆరు ముఖములు కలది).

కార్తికేయునికి ప్రతీక. దీనిని ధరించడం వల్ల రక్తపోటు, హిస్టీరియా పోతాయి. సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది).

కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం.

అష్టముఖి రుద్రాక్ష(ఎనిమిది ముఖాలు కలిగినది).

విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.


నవముఖి రుద్రాక్ష (తొమ్మిది ముఖాలు కలది)

నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.

దశముఖి రుద్రాక్ష(పది ముఖాలు కలిగినది).

దశావతార స్వరూపం. జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. కాగా, ఇండస్ట్రియల్ స్కానింగ్ కానీ, డెంటల్ ఎక్స్ రే యంత్రంతో నిజమైన రుద్రాక్షని గుర్తించవచ్చు.

ఇవి కూడా చదవండి : నాలుగు గోడలు కాదు నలుగురికి ఆదర్శం కావాలి..

Next Story

Most Viewed