అగ్నిపర్వతంపై సాహసం.. ప్రాణాలు కూడా లెక్కచేయలేదుగా(వీడియో)

by Disha Web Desk 21 |
అగ్నిపర్వతంపై సాహసం.. ప్రాణాలు కూడా లెక్కచేయలేదుగా(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు కొందరు వ్యక్తులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయరు. ఇక వాళ్లు ఎంచుకున్న మార్గంలో ఎన్ని ఒడుదుడుకులున్నా వెనకడుగు వేయకుండా సాహసాలకు సిద్ధపడతారు. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించి రికార్డులు సృష్టిస్తారు. తాజాగా అలాంటి కృషి, పట్టుదలతో ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సాహసం చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.

బ్రెజిల్‌కు చెందిన రఫెల్ జుంగో బ్రిడి, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ షుల్జ్ వీరిద్దరికీ సాహసాలు చేయడమంటే ప్రాణం. ఈ క్రమంలో వారు నైరుతి పసిఫిక్ మహాసముద్రంలోని టన్నా ఐల్యాండ్‌ వనాటు వద్ద యసుర్ అగ్నిపర్వతం మీద ఒక సన్నని తాడు (స్లాక్ లైన్) పై ప్రాణాలకు తెగించి మరీ సాహసం చేశారు. అగ్నిపర్వతం నుంచి సుమారు 137 అడుగుల ఎత్తులో ఎలాంటి సహాయం లేకుండా నడక మొదలెట్టారు. ఆ సన్నని తాడుపై సుమారు 261మీటర్ల(856 అడుగులు) దూరం నడక సాగించారు. కింద నుంచి అగ్ని కిలలు పైకి ఎగసి పడుతున్నా.. ఎటువంటి భయం లేకుండా మార్గాన్ని చేరుకున్నారు. దీంతో వారి సాహసానికి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు.


Next Story

Most Viewed