ఈ బ్లడ్ గ్రూప్ వారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది.. తాజా వెల్లడి

by Disha Web Desk 9 |
ఈ బ్లడ్ గ్రూప్ వారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది.. తాజా వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతంగా కూర్చొని తినే సమయం కూడా లేకుండా పోతోంది. తినే తిండి కూడా హడావుడిగా తింటోన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ బిజీ షెడ్యూల్‌లో ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా డబ్బుల వెంట పరిగెడుతున్నారు. దీంతో మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారీన పడుతున్నాం. కాగా, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా గుండెను జాగ్రత్తగా చూసుకోవాలి. గుండె మానవుని శరీరంలో ముఖ్యమైన అవయవం. కానీ జనాలు సరైన సమయానికి ఆహారం తీసుకోక.. నేటి రోజుల్లో యువత, వృద్ధులు అని తేడా లేకుండా 30 ఏళ్ల వయస్సలోనే చాలా మందికి గుండెపోటు వస్తుంది.

అయితే, కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ వాళ్లకు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందంటూ అమెరికా హార్ట్ అసోసియేషన్ నిపుణులు దాదాపు 4 లక్షల మందిపై పరిశోధనలు జరిపి తాజాగా వెల్లడించారు. పరిశోధన ప్రకారం.. ‘A, B’ బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు రక్తం గడ్డ కట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. దీంతో గుండె జబ్బులు అధికంగా వస్తాయి. ఈ గ్రూప్ ఉన్నవారికి థ్రోంబోసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. వారి శరీరంలో రక్త నాళాలు కుంచించుకుపోయి రక్తసరఫరా అనేది సక్రమంగా జరగదు. దీంతో గుండె మీద ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. అలాగే ‘O’ గ్రూప్ ఉన్నవారిలో హార్ట్ ఎటాక్ సంబంధిత వ్యాధులు తక్కువగా ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. అంతేకాకుండా గుండె జబ్బులు తక్కువగా ఉంటాయి. హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం మిగతా బ్లడ్ గ్రూప్ కంటే 10 శాతం తక్కువ అని పేర్కొన్నారు.



Next Story