అమ్మాయిలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే చర్మ సమస్యలు ఇవే..!

by Disha Web Desk 10 |
అమ్మాయిలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే చర్మ సమస్యలు ఇవే..!
X

దిశ,వెబ్ డెస్క్: సాధారణంగా అమ్మాయిలు అందమైన, మచ్చలు లేని చర్మం కావాలని కోరుకుంటారు. అయితే, రుతుక్రమం, హార్మోన్ల ఆహార అలవాట్లు వల్ల అనేక చర్మ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ చర్మ సమస్యల కొంతమంది కారణంగా బయటకి వెళ్లడానికి ఇబ్బంది పడతారు. అమ్మాయిలు ఎదుర్కొనే సౌందర్య సమస్యలేమిటో ఇక్కడ చూద్దాం..

ముడతలు

వయస్సు పెరిగే కొద్దీ.. చర్మం స్థితిస్థాపకత, కొల్లాజెన్‌ను కోల్పోతుంది. దీని వల్ల చర్మం పై ముడతలు, ఫైన్‌ లైన్స్‌ ఏర్పడతాయి. దీన్ని నివారించడానికి పోషకాహారం తీసుకోవాలి, ఒత్తిడి తగ్గించుకోవాలి.

పొడి చర్మం

చాలా మంది అమ్మాయిలు పొడి చర్మం సమస్యను ఎదుర్కొంటారు. పొడి చర్మం వల్ల ముఖం గరుకుగా కనిపిస్తుంది. దీనిని నివారించడానికి.. హైడ్రేట్‌గా ఉండటం చాలా ముఖ్యం. మీ ఆహారంలో వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ తీసుకుంటే.. ఈ సమస్య పరిష్కారం అవుతుంది.

సన్ బర్న్

అమ్మాయిలు ఎదుర్కొనే సాధారణ సమస్య సన్‌బర్న్‌.. దీని కారణంగా సూర్యుడి UV కిరణాలు వల్ల త్వరగా ఎఫెక్ట్‌ అవుతుంది. సన్‌బర్న్‌ వల్ల చర్మం కమిలిపోయి.. నల్లగా మారుతుంది. సన్‌బర్న్‌ను నివారించడానికి.. సన్‌స్క్రీన్‌ కచ్చితంగా ఉపయోగించాలి.​



Next Story

Most Viewed