అక్కడ పశువులకూ ఆదివారం సెలవు.. ఆ కారణం వెనక దాగిన కఠిన నిర్ణయం!

by Disha Web Desk 23 |
అక్కడ పశువులకూ ఆదివారం సెలవు.. ఆ కారణం వెనక దాగిన కఠిన నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: మనుషులకు సెలవు ఉన్నట్లుగాను జంతువులకు సెలవు ఉండాలి అని నిర్ణయించుకున్నారు జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లా వాసులు.ఈ రాష్ట్రంలో మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా విశ్రాంతి అవసరమని స్థానికులు నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ఇతర ప్రైవేట్ సంస్థలకు ఆదివారం సెలవు. వారానికో సెలవుతో ప్రజలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని.. భావించిన సంస్థలు.. వ్యక్తిగత పనిని పూర్తి చేయడానికి వారానికి ఒక రోజు విశ్రాంతిని ఇస్తారు. ఒక రోజు విశ్రాంతి తీసుకున్న వ్యక్తులు.. తిరిగి మరుసటి రోజు చేసే పనిని మునుపటి కంటే ఎక్కువ శక్తితో చేస్తారని విశ్వసిస్తారు.

అలాగే మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాలి.. అది కూడా ఆదివారమే అని ప్రకటించుకున్నారు జార్ఖండ్ ప్రజలు. అంటే ఆ రోజు పశువులకు కేవలం మేత మాత్రమే ఇస్తారు. వాటిచేత ఎటువంటి పనులు చేయించరు. ఈ సంప్రదాయాన్ని లతేహర్ జిల్లాలోని దాదాపు 20 గ్రామాల ప్రజలు గత 100 ఏళ్లకు పైగా అనుసరిస్తున్నారు. అదేవిధంగా పాలిచ్చే జంతువులకు పాలు కూడా తీయరట.ఆ రోజు పూర్తిగా పశువులకు కావాల్సిన మేత, పచ్చ గడ్డిని ఇస్తారు. వందేళ్ల క్రితం ఓ ఎద్దు పొలంలో దున్నుతున్న సమయంలో కింద పడి చనిపోయిందట. అప్పుడు ప్రజలు ఎద్దు ఎక్కువ పని చేయడం వల్లనే అలా జరిగిందని, వీటికి కూడా మనుషులకు లాగా విశ్రాంతి అవసరం అని వారికి అప్పుడు అనిపించిందట. వెంటనే పశువుల హాలీ డేను ప్రకటించి.. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానినే అమలు చేస్తున్నారట.

ఇవి కూడా చదవండి: కంటి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే కన్నీళ్లు చాలా అవసరం..

Next Story

Most Viewed