- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Antibiotics: యాంటీ బయాటిక్స్ అధికంగా వాడుతున్నారా?.. నాచురల్ ఇమ్యూనిటీ పవర్ తగ్గొచ్చు!
దిశ, ఫీచర్స్: జలుబు చేసినా, నీరసంగా అనిపించినా, అనారోగ్యం చేస్తుందనే అనుమానం వచ్చినా ఎంతకైనా మంచిదని కొందరు యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎక్కువకాలం వీటిని తీసుకోవడంవల్ల శరీరంలో వ్యాధినిరోధకతకు వ్యతిరేకంగా సహజంగా పోరాడే వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. నాచురల్ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. యాంటీబయాటిక్స్ అంటే బ్యాక్టీరియాను చంపడం లేదా వాటి ప్రభావాన్ని అడ్డుకోగలిగే యాంటీమైక్రోబయల్ పదార్థాల సమ్మేళనం అని చెప్పవచ్చు. వీటిని ఎప్పుడంటే అప్పుడు వాడటంవల్ల శరీరంలో వివిధ అవయవాల పనితీరులో సమతుల్యత దెబ్బతింటుంది. జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ను, వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నివారించే ఉద్దేశంతో యాంటీబయాటిక్స్ రూపొందించబడినప్పటికీ, ఎక్కువగా వాడటంవల్ల ఈ మందులు శరీరంలో మనకు మేలు చేసే మంచి బ్యాక్టీరియాను కూడా చంపుతాయి. అందుకే యాంటీబయాటిక్స్ తరచుగా తీసుకునే వ్యక్తుల్లో నోటి, గొంతు, జననేంద్రియాల సమస్యలు, ఇన్ఫెక్షన్లు తలెత్తుతుంటాయి. డాక్టర్ల సలహా మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలని, ప్రతీ అనారోగ్య సమస్యకు సొంతంగా యూజ్ చేయవద్దని నిపుణులు చెప్తున్నారు.