Smoking: దమ్ముకొడితే స్ట్రెస్ తగ్గదు.. మరింత పెరుగుతుంది!

by Disha Web Desk 10 |
Smoking: దమ్ముకొడితే స్ట్రెస్ తగ్గదు.. మరింత పెరుగుతుంది!
X

దిశ, ఫీచర్స్: ‘స్ట్రెస్‌గా ఉంది. దమ్ము కొడితేనే రిలాక్స్ అవుతుంది’... ధూమపానం చేసేవారి నోటి నుంచి తరచూ వినిపించే మాట ఇది. కానీ అది నిజం కాదు. ధూమపానంవల్ల ఒత్తిడి తగ్గకపోగా మరింత పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. టెన్షన్, బాధ, నొప్పి వంటివి ఎదుర్కొన్నప్పుడు సిగరెట్ తాగితే కొంత ఉపశమనం కలుగుతుందనేది మానసిక రుగ్మతలో నుంచి వచ్చే ఫీలింగ్ తప్ప వాస్తవం కాదట. పైగా ధూమపానం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

సిగరెట్‌లోని నికోటిన్‌కి మన మూడ్‌ని మార్చే శక్తి ఉంటుంది. అందుకే ధూమపానం చేసినప్పుడు అది నిరాశ, కోపం, ఆందోళన ఫీలింగ్స్‌ను దూరం చేసినట్లు క్షణంపాటు ఫీలింగ్ కలుగుతుంది కానీ ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. పైగా అది ఒత్తిడిని ఏమాత్రం తగ్గించదని ఒక అధ్యయనంలో తేలింది. ధూమపానంవల్ల కండరాలపై ఒత్తిడి, శరీరంలో రక్తపోటు పెరుగుతాయి. రక్తనాళాలు కుంచించుకుపోతాయి. గుండెకొట్టుకునే తీరులో మార్పులు వస్తాయి. మెదడుకు, శరీరానికి లభించే ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. నికోటిన్ మెదడు(Mind)లోకి ప్రవేశిస్తుంది. ఈ సందర్భంగా విడుదలయ్యే డోపమైన్ కొంత రిలాక్స్ అయిన ఫీలింగ్ కలిగిస్తుంది కానీ ఎక్కువగా నష్టం జరుగుతుంది. చాలా మంది చైన్ స్మోకర్స్ ధూమపానం మానకపోవడానికి కారణం సిగరెట్ తాగినప్పుడు మెదడులో విడుదలయ్యే ఈ డొపమైన్ కారణం.

వదులుకోండిలా ..

* సిగరెట్ అలవాటు ఉన్నవారు దమ్ము కొట్టడానికి బయటకు వెళ్తుంటారు. అలా వెళ్లినప్పుడు దమ్ము కొట్టే బదులు దానిని పక్కన పడేసి వాకింగ్ చేయడం మొదలు పెట్టండి. అస్సలు సిగరెట్ ప్యాక్ వెంట తెచ్చుకోకపోవడం బెటర్. దీనివల్ల క్రమంగా ఒక రకమైన రిలాక్సేషన్ లభిస్తుంది.

* దీర్ఘకాలికంగా స్ట్రెస్‌కు గురవుతున్నట్లయితే యోగా(Yoga) లేదా ఇతర ఎక్సర్ సైజులను ఎంచుకోండి. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. యోగా మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది.

* బాధలు, సమస్యలను సన్నిహితులు, స్నేహితులు లేదా నమ్మదగిన వ్యక్తితో పంచుకోండి. తప్ప సిగరెట్ తాగితే మేలు జరుగుతుందనే ఆలోచన తీసివేయండి.

* స్ట్రెస్‌కు గురైనప్పుడు సిగరెట్(Cigarette) ప్యాక్‌ను చేతిలోకి తీసుకోకండి. కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ కళ్ళు మూసుకుని మీకు ఇష్టమైన ప్రదేశాన్ని, లేదా ఇష్టమైన వ్యక్తిని ఊహించుకొని రిలాక్స్ అయ్యేందుకు ట్రై చేయండి. జలపాతం, నీటి సవ్వడి, సూర్యుడి లేలేత కిరణాలు, మట్టి వాసన ఇలా ప్రకృతి సౌందర్యాన్ని ఫీల్ అవ్వండి. ఆ ఆనందంలో, మధురానుభూతిలో మీరు సిగరెట్ తాగడం మర్చిపోతారు. కొన్ని రోజులు ఇలా చేయడం మేలు చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ధూమపానం చేస్తే లివర్ ఫెయిల్యూర్, సంతానలేమి సమస్యలు, గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి : ముక్కు పుడకతో సుఖ ప్రసవం.. ఆ సమస్యలకూ చెక్!

Next Story

Most Viewed