ముక్కు పుడకతో సుఖ ప్రసవం.. ఆ సమస్యలకూ చెక్!

by Disha Web Desk 20 |
ముక్కు పుడకతో సుఖ ప్రసవం.. ఆ సమస్యలకూ చెక్!
X

దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ సాంప్రదాయాలలో స్త్రీలు ముక్కు, చెవులు కుట్టించడం ఒకటి. అయితే ఆడవారు ముక్కుపుడక, చెవికమ్మలు ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం. అమ్మాయికి ఏడు, పదకొండు సంవత్సరాలు వచ్చాయంటే చాలు.. ముక్కు, చెవులు కుట్టించే పనిలో పడతారు తల్లిదండ్రులు. హిందూ సాంప్రదాయలలో స్త్రీకి మంగళ సూత్రం ఎంత ముఖ్యమో ముక్కుపుడక ధరించడం కూడా అంతే ముఖ్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి. వివాహ సమయంలో వధువు తప్పనిసరిగా ముక్కుపుడక ధరించాలి అంటారు. అసలు ఈ ముక్కుపుడక ధరించే సాంప్రదాయం ఎందుకు వచ్చింది, ముక్కుపుడక ధరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి, ఎందుకు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్త్రీలు ముక్కుపుడక ధరించాలనే సంప్రదాయం మధ్యప్రాచ్యంలో మొదలై 16వ శతాబ్దంలో భారత దేశంలో అడుగు పెట్టిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహిత అనే గ్రంధంలో కూడా ముక్కపుడక ప్రాధాన్యం గురించి వివరించారట. ముక్కుకి ఎడమవైపున చంద్రనాడి, కుడివైపున సూర్యనాడి ఉంటాయట. అందుకే కుడివైపు ముక్కుపుడకలో మండలాకారమైన చిన్నరాయిని ధరించాలని, ఎడమవైపున అర్ధ చంద్రాకారంలో కనిపించే ముక్కుపుడకను ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

మహిళల పునరుత్పత్తి అవయవాలకు, ముక్కుపుడకకు ఎంతో సంబంధం ఉందని ఆయుర్వేదం చెబుతుంది. మహిళల ముక్కు పుడక ఎడమవైపు ఉండే ముక్కు భాగంలోని నరాలను శాంతపరుస్తుందట. దాంతో ఆడవారికి గర్భకోశవ్యాధులు తగ్గుతాయట. దాంతో స్త్రీ ప్రసవం సమయంలో అధిక ఒత్తిడికి లోనవ్వకుండా, పురుటినొప్పులు ఎక్కువ కలగకుండా సుఖప్రసవం జరుగుతుందని గ్రంధాల్లో ప్రస్తావించారు. అంతే కాదు నెలసరి సమయంలో కడుపునొప్పితో బాధపడే మహిళలు ముక్కు మీద ఉండే ఒక నోడ్ దగ్గర ముక్కును కుట్టింకుంటే ఆ నొప్పికూడా లేకుండా చేస్తుందట. అంతే కాకుండా చెవికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా సహాయపడుతుంది. కన్ను, చెవికి సంబంధించిన నరాలు ముక్కుకు ఉన్న నరాలతో సంబంధం కలిగి ఉండడం వలన చెవిపోటు రాకుండా చేస్తుందట. అంతేకాక శ్వాస సంబంధమైన వ్యాధులు కూడా రాకుండా చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇకపోతే ప్రాంతాలవారిగా ఎవరి సాంప్రదాయాలకు తగ్గట్టు అక్కడి మహిళలు ముక్కుపుడకను ధరిస్తారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం వివాహసమయంలో వధువు ముక్కుకు రింగును ధరిస్తారు.

Next Story

Most Viewed