లైంగిక జీవితానికే ముప్పు తెస్తున్న ఉప్పు.. అబ్బాయిలు ఈ విషయంలో జాగ్రత్త!

by Disha Web Desk 8 |
లైంగిక జీవితానికే ముప్పు తెస్తున్న ఉప్పు.. అబ్బాయిలు ఈ విషయంలో జాగ్రత్త!
X

దిశ, ఫీచర్స్ : ఉప్పు అతిగా తినకూడదని వైద్యులు చెబుతుంటారు. అయినా కానీ కొంత మంది అధికంగా ఉప్పు తిని లేనిపోని సమస్యలను తెచ్చుకుంటున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే తాజాగా చేసిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. ఉప్పు అధికంగా తినడం వలన భార్య భర్తల మధ్య లైంగిక సంబంధం దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.

ఉప్పును అధికంగా తినే మగవారిలో అంగస్తంభన సమస్యలు పెరుగుతున్నట్లు వారు తెలిపారు. భార్య భర్తల లైంగిక జీవితం బాగుండాలంటే మగవారు అతిగా ఉప్పు తినకూడదు, దీనిని ఎక్కువగా తినడం వలన పురుషులు లైంగికంగా చాలా బలహీనం అవుతున్నారని వారు పేర్కొన్నారు.

ఎందుకంటే ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన రక్తనాళాలపై ఒత్తిడి పడి, ఇది హైపర్ టెన్షన్, అధికర్తపోటు సమస్యలను తీసుకొస్తుంది. దీంతో ఈ సమస్యలు ఉన్నవారికి లైంగిక చర్యలో సంతృప్తి దొరకదంట, ఇది పురుషులలో అంగస్తంభన సమస్యలు వస్తూ ఉంటే, స్త్రీలలో లైంగిక కోరికలు తగ్గుతున్నట్టు అధ్యయనం చెబుతోంది. అందువలన భార్యభర్తల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా వారి లైంగిక జీవితం బాగుండాలి అంటే ఉప్పు అధికంగా తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు.

Next Story