బ్యాక్టీరియాను చంపే ప్లాంట్ టాక్సిన్.. కనుగొన్న శాస్త్రవేత్తలు

by Disha Web Desk 10 |
బ్యాక్టీరియాను చంపే ప్లాంట్ టాక్సిన్.. కనుగొన్న శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్: బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు వాటిని చంపేందుకు డెవలప్ చేసిన డ్రగ్స్‌ను ఎదిరించే సామర్థ్యాన్ని కలిగి ఉండటాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. అంటే మందులు బ్యాక్టీరియాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. ఈ క్రమంలో యాంటీబయాటిక్-రెసిస్టెంట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ప్రత్యక్ష ఫలితం కారణంగా ప్రతిరోజూ 3,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2019లో దాదాపు 1.2 మిలియన్లకు పైగా ప్రజలు ఈ ఇన్ఫెక్షన్స్ బారిన పడి చనిపోయారు. ఇలాంటి సమయంలో బ్రిటీష్, జర్మన్ మరియు పోలిష్ శాస్త్రవేత్తల బృందం గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాక్టీరియాపై ఎటాక్ చేయడంలో ప్రత్యేక మార్గం కలిగి ఉన్న ఎఫెక్టివ్ యాంటిబయాటిక్స్‌ను క్రియేట్ చేసే ప్లాంట్ టాక్సిన్‌ను కనుగొన్నారు. ఈ సరికొత్త యాంటీబయాటిక్ 'ఆల్బిసిడిన్' ఇప్పటికే ఉన్న యాంటీబయాటిక్ మందులతో పోల్చితే బ్యాక్టీరియాపై దాడి చేసే ప్రత్యేకమైన పద్ధతిని కలిగి ఉందని వెల్లడించారు.

'Xanthomonas albilineans' అనే బ్యాక్టీరియల్ ప్లాంట్ పాథోజెన్‌ల నుంచి 'ఆల్బిసిడిన్'ను వస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు. ఈ పాథోజెన్ ప్లాంట్‌పై ఎటాక్ చేసేందుకు 'ఆల్బిసిడిన్'ను ఉపయోగిస్తున్నా..బ్యాక్టీరియాను చంపడంలోనూ అత్యంత ప్రభావవంతమైనదని కనుగొనబడింది. దీని తక్కువ సాంద్రతలు సైతం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉన్నాయని గుర్తించారు. ఫ్లూరోక్వినోలోన్స్ వంటి విస్తృతంగా ఉపయోగించే యాంటీబయాటిక్స్‌కు నిరోధకతను కలిగిన బ్యాక్టీరియాపై కూడా గణనీయంగా ప్రభావం చూపగలవన్నారు. అనేక ఏళ్లుగా E coli వంటి మల్టీడ్రగ్-రెసిస్టెంట్ పాథోజెన్‌ల స్థిరమైన పెరుగుదల ఉన్నందున కొత్త అన్వేషణ ఆరోగ్య సంరక్షణ రంగంలో సానుకూల అభివృద్ధి అని చెప్పవచ్చు. కాగా ఈ కొత్త పరిశోధన ఫలితాలను ఉపయోగించడం ద్వారా వివిధ రకాల బ్యాక్టీరియా వ్యాధులను ఎదుర్కోవటానికి సమర్థవంతమైన మార్గాలను కనుగొనాలని ఆశిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం అధునాతన పద్ధతులను ఉపయోగిస్తున్నారు.


Next Story

Most Viewed