Alarm: అలారమ్ స్నూజ్ చేస్తున్నారా? బ్రెయిన్ దెబ్బతింటుందని నిపుణుల హెచ్చరిక

by Disha Web Desk 10 |
Alarm: అలారమ్ స్నూజ్ చేస్తున్నారా? బ్రెయిన్ దెబ్బతింటుందని నిపుణుల హెచ్చరిక
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా చాలా మంది ఉదయాన్నే నిద్రలేచేందుకు అలారమ్ పెట్టుకుంటారు. కానీ రింగ్ కాగానే బెడ్ మీద నుంచి లేచేందుకు బద్దకిస్తూ స్నూజ్ చేస్తుంటారు. కానీ ఇలా చేస్తే బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుందంటున్న నిపుణులు.. తద్వారా మిమ్మల్ని మీరు బాధించుకుంటున్నారని గుర్తుంచుకోమని హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన శాస్త్రీయ కారణాన్ని వివరిస్తున్నారు.

నార్మల్‌గా అలారమ్ మోగాక స్నూజ్ చేస్తుంటాం. దీంతో బ్రెయిన్ మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది. అంటే మీరు మేల్కొన్న తర్వాత తిరిగి నిద్రలోకి వెళ్లినప్పుడు, మీ బ్రెయిన్ స్లీప్ సైకిల్ ప్రారంభమవుతుంది. అయితే ఈ చక్రం పూర్తయ్యేందుకు 75 నుంచి 90 నిమిషాలు పడుతుంది. కానీ మీరు స్నూజ్ చేసింది పది నిమిషాలకే కాబట్టి.. అలారమ్ మోగగానే.. బ్రెయిన్ ఆ గాఢ నిద్ర నుంచి మేల్కొనాల్సి వస్తుంది. సైకిల్ పూర్తికాకపోవడం వల్ల మెదడు నిద్రలేని స్థితిలోనే ఉంటుంది. ఈ సిచ్యువేషన్‌ను నిద్ర జఢత్వం(స్లీప్ ఇనెర్షియా) అంటుంటాం. దీని నుంచి రికవరీ అయ్యేందుకు దాదాపు నాలుగు గంటల సమయం తీసుకుంటుంది. ఈ గ్యాప్‌లో మెదడు పనితీరు క్షీణిస్తుంది. అయోమయ పరిస్థితి నెలకొంటుంది. రియాక్షన్ టైమ్ స్లో అయిపోతుంది. పేలవమైన స్వల్పకాలిక జ్ఞాపకశక్తి... ఆలోచన, తార్కికం, గుర్తుంచుకోవడం, నేర్చుకోవడం వంటి విషయాల్లో నెమ్మదిగా ఉంటారు.

Next Story