వేసవిలో దోమల బెడద? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

by Disha Web Desk 10 |
వేసవిలో దోమల బెడద? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
X

దిశ, ఫీచర్స్: వేసవి వచ్చేసింది. మండే ఎండలో ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, మామిడి పండ్లు, వాటర్ మిలన్‌ను ఎంతగా ఆస్వాదిస్తారో.. అదే సమయంలో సాయంత్రం కాగానే దోమల బెడదను భరిస్తుంటారు. వీటి వల్ల దురద, దద్దుర్లతో పాటు కొన్ని సందర్భాల్లో డెంగ్యూ, మలేరియా, జికా వైరస్ వంటి వ్యాధులు కూడా ఎటాక్ అవుతుంటాయి. సమ్మర్ హాలీడేస్‌ను ఎంజాయ్ చేయకుండా చేస్తుంటాయి. అందుకే దోమల నుంచి కాపాడుకునేందుకు ఇంట్లోనే తయారుచేసుకునే సహజ సిద్ధమైన చిట్కాల గురించి తెలుసుకుందాం.

1. ముఖ్యమైన నూనెలు

సిట్రోనెల్లా, యూకలిప్టస్, పెప్పర్‌మింట్, లావెండర్ వంటి ముఖ్యమైన నూనెలు సహజంగా దోమలను తిప్పికొట్టే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అమెరికన్ మస్కిటో కంట్రోల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. సిట్రోనెల్లా ఆయిల్ రెండు గంటల వరకు దోమలను తిప్పికొట్టడంలో DEET(డై ఇథైల్-మెటా-టోలుఅమైడ్) వలె ప్రభావవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు.

2. వెల్లుల్లి

వెల్లుల్లి.. చర్మం ద్వారా విడుదలయ్యే అల్లిసిన్ వంటి సమ్మేళనాలను కలిగి ఉంటుంది. దోమలు మనుషులను గుర్తించడాన్ని కష్టతరం చేస్తుంది. ఈ నూనె ఎనిమిది గంటల వరకు దోమలను తిప్పికొట్టడంలో ఎఫెక్టివ్‌గా ఉంటుంది.

3. వేప నూనె

వేప నూనె సహజ పురుగుమందు. అమెరికన్ మస్కిటో కంట్రోల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం నీమ్ ఆయిల్ 12 గంటల వరకు దోమలను దగ్గరకు రానివ్వదు.

4. ఆపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దోమలను తరిమికొడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్, నీటిని మిక్స్ చేసి చర్మానికి అప్లై చేస్తే దోమలు దగ్గరకు కూడా రావు.

5. టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్‌లో దోమలను తిప్పికొట్టే టెర్పినెన్-4-ఓల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. అమెరికన్ మస్కిటో కంట్రోల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం టీ ట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్ మిక్సింగ్ దోమలను తరిమికొట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపింది.

6. సిట్రస్ పండ్లు

నిమ్మ, నారింజ వంటి సిట్రస్ ఫ్రూట్స్ చర్మంపై రుద్దడం వల్ల దోమలను తరిమికొట్టవచ్చు. వీటి బలమైన సువాసన స్కిన్ ఒరిజినల్ ఓడర్‌ను కప్పివేస్తుంది. కాబట్టి దోమలు గుర్తించడం కష్టతరం అవుతుంది.

7. తులసి

తులసిలో దోమలను తరిమికొట్టే యూజినాల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. అమెరికన్ మస్కిటో కంట్రోల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో తులసి నూనె రెండు గంటల వరకు దోమలను దరికి రానివ్వదు.

మరిన్ని చిట్కాలు

* దోమ కాటును నివారించడానికి దోమల వికర్షకాలను ఉపయోగించండి.

* పొడవాటి చేతులు కలిగిన డ్రెస్సులు, ప్యాంటు, సాక్స్ ధరించడం వల్ల దోమలు కుట్టకుండా నివారించవచ్చు. దోమలు ముదురు రంగులకు ఆకర్షితులవుతాయి. కాబట్టి లేత రంగు దుస్తులను ధరించండి.

* బయట పడుకున్నప్పుడు దోమ తెరలను ఉపయోగించండి

* ఎక్కువ కాలం నిలిచిన నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి. కాబట్టి ఇంటి చుట్టూ ఉన్న పరిసరాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోండి.

* ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలు, తలుపులకు జాలీలు వాడండి.

* తెల్లవారుజాము, సంధ్యా సమయంలో దోమలు చురుకుగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాల్లో బయట ఉండకుండా ప్రయత్నించండి.

* దోమలు బలహీనమైన ఫ్లైయర్‌లు, కాబట్టి ఫ్యాన్‌లను ఉపయోగించడం వల్ల దోమలను దూరంగా ఉంచవచ్చు.



Next Story

Most Viewed