పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై మరోసారి సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |
పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై మరోసారి సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సీఎం జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లకోసారి భార్యలను మార్చడం సరికాదని ఆయన సూచించారు. ఒకసారి జరిగితే పొరపాటు అని, రెండోసారి జరిగితే గ్రహపాటని, పదేపదే జరిగితే అలవాటని ఎద్దేవా చేశారు. ఫ్యాన్స్‌కు రోల్ మోడల్‌గా ఉండాలని, ఇలా భార్యలను మార్చుకుంటూ పోతూ ఏం సందేశం ఇవ్వాలని పవన్ అనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రత్యర్థులను తిట్టాలనేది తన ఉద్దేశం కాదని, కేవలం తప్పులపై విమర్శలు చేస్తామన్నారు. బీజేపీ కూడా తప్పులు చేస్తోందని, అందుకే నిలదీస్తున్నామని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడటం తప్పన్నారు. మతం వేరని, రిజర్వేషన్లు వేరని చెప్పారు. ప్రతి మతంలోనూ ఓసీలు, బీసీలు ఉంటారని వ్యాఖ్యానించారు. బీజేపీ అన్ని బిల్లులకు తాము మద్దతివ్వలేదని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలుస్తామని, నిధులు తెచ్చుకుంటామని సీఎం జగన్ పేర్కొన్నారు.

Next Story