R21/Matrix-M : మలేరియా నివారణకు కొత్త వ్యాక్సిన్‌ను కనుగొన్న పరిశోధకులు

by Disha Web Desk 10 |
R21/Matrix-M : మలేరియా నివారణకు కొత్త వ్యాక్సిన్‌ను కనుగొన్న పరిశోధకులు
X

దిశ, ఫీచర్స్: వందల ఏళ్ల నుంచి మానవాళిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల్లో మలేరియా ఒకటి. ఇది దోమకాటు ద్వారా వ్యాపిస్తుందన్న విషయం తెలిసిందే. డబ్ల్యుహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రతీ సంవత్సరం 6 లక్షలమందికి పైగా దీనిబారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ వ్యాధిని పూర్తిగా తరిమికొట్టే ప్రయత్నాలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మలేరియా నుంచి పూర్తి రక్షణకోసం ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సంయుక్తంగా వ్యాక్సినేషన్ కనుగొనేందుకు పరిశోధనలు జరుపుతూ వచ్చాయి. ఇటీవల తమ ప్రయోగాలు ఫలించడంతో తాము కనుగొన్న ఆర్ 21/ మ్యాట్రిక్స్ - ఎం (R21/Matrix-M)అనే వ్యాక్సిన్‌ను వెస్ట్ ఆఫ్రికన్ దేశమైన ఘనాలో దానిని యూజ్ చేసేందుకు ఆ రెండు సంస్థలు సిద్ధమయ్యాయి. ఆఫ్రికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ కూడా పర్మిషన్ ఇచ్చింది. ముందుగా ఈ వ్యాక్సిన్ మలేరియా డెత్ రేట్ ఎక్కువగా ఉన్న కారణంగా ఆఫ్రికన్ దేశాల్లో వినియోగించనున్నారు. 5 నుంచి 36 నెలల వయస్సుగల పిల్లలకు ఈ టీకాలు వేస్తారు.

మూడు దశాబ్దాల ఫలితం

ఆక్స్‌ఫర్డ్‌లో ఆర్ 21/ మ్యాట్రిక్స్ - ఎం వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేసి, తయారు చేసేందుకు 30 ఏళ్ల సమయం పట్టిందని, అన్ని దేశాలకు సరఫరా చేయగల సమర్థతను, సదుపాయలను కలిగి ఉన్నామని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ అయినటువంటి అడ్రియన్ హిల్ తెలిపారు. పెద్ద మొత్తంలో తయారు చేసిన వ్యాక్సిన్‌ను అనుకూలమైన ధరతో మలేరియా బాధిత ఆఫ్రికా దేశాలకు సరఫరా చేస్తామని అతను పేర్కొన్నాడు. వ్యాక్సిన్ కనుగొనడంతో ప్రపంచ వ్యాప్తంగా మలేరియాను పూర్తిగా నివారించాలన్న తమ లక్ష్యం నెరవేరిందని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా వెల్లడించారు. యూకే, థాయ్‌లాండ్‌, బుర్కినా ఫాసో, కెన్యా, మాలి, టాంజానియాలలో క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాను తప్పక పాటించాల్సిందే!


Next Story

Most Viewed