- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయా మెడికల్ సెంటర్‌తో జట్టుకట్టిన న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్.. అందుబాటులోకి 10 ల్యాబ్‌లు, 25 కస్టమర్ కేర్ సెంటర్లు

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డయాగ్నస్టిక్ చైన్‌లలో ఒకటైన న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్ (Neuberg Diagnostics) తెలంగాణలో తన సేవలను మరింత విస్తరింపజేసింది. ఈ మేరకు విశాఖపట్నం కేంద్రంగా ఉన్న విజయ మెడికల్ సెంటర్ (Vijaya Medical Center)తో జట్టుకట్టింది. దీంతో విజయ మెడికల్ సెంటర్ - ఎ యూనిట్ ఆఫ్ న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్ అనే కొత్త బ్రాండ్‌కు బీజం పడింది. ఈ సందర్భంగా మొత్తం 10 ల్యాబ్‌లు, 25 కస్టమర్ కేర్ సెంటర్లను ఇవాళ హైదరాబాద్ బేగంపేట్‌లోని తాజ్ వివాంతాలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొప్పాక సూర్యనారాయణ (డైరెక్టర్), డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి (ఫౌండర్ అండ్ కో-చైర్మన్, మ్యాక్స్‌విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్), డాక్టర్ జి.ఎస్.కె. వేలు (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్) పాల్గొన్నారు.
గ్రామాలకు అధునాతన డయాగ్నస్టిక్ సేవలు.. డిప్యూటీ సీఎం భట్టి
అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని అన్నారు. వ్యాధుల భారం పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad)కు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ, జిల్లా ప్రాంతాలకు కూడా అధునాతన డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి రావాలన్నారు. విజయ మెడికల్ సెంటర్ తెలంగాణలో తమ సేవలను విస్తరిస్తుండటం సంతోషదాయకమని అన్నారు. కొత్తగా ప్రారంభించిన ల్యాబ్‌లు 24 గంటల హోమ్ కలెక్షన్ సేవలను అందిస్తాయని తెలిపారు. రొటీన్ డయాగ్నస్టిక్స్ నుంచి అధునాతన స్పెషాలిటీ టెస్టింగ్ వరకు విస్తృతమైన పరీక్షలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మాలిక్యులర్, మెటబాలిక్, జెనెటిక్ టెస్టింగ్, రిప్రొడక్టివ్, ఇన్‌హెరిటెడ్, ఆంకాలజీ, ట్రాన్స్‌ప్లాంట్ ఇమ్యునాలజీ, ప్రివెంటివ్ హెల్త్ చెకప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
రాజీ పడకుండా నిరంతర సేవలు అందిస్తాం.. డాక్టర్ జీఎస్‌కే వేలు
న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్‌కే వేలు (GSK Velu) మాట్లాడుతూ.. మా తదుపరి వృద్ధి అధ్యాయానికి తెలంగాణ (Telangana) రాష్ట్రమే ఆధారమని అన్నారు. విజయ మెడికల్ సెంటర్ కింద 10 కొత్త క్లినికల్ ల్యాబ్‌లు, 25కి పైగా కస్టమర్ కేర్ సెంటర్లతో హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోని సమాజాలకు నమ్మకమైన టెస్టింగ్ సేవలను అందించబోతున్నాయని తెలిపారు. ఖచ్చితత్వం, టర్న్ అరౌండ్ టైమ్‌లో ఎలాంటి రాజీ లేకుండా ప్రజలకు నిరంతరం తమ సేవలను అందిస్తామని తెలిపారు. ఈ విస్తరణ ద్వారా తెలంగాణలో ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చి, ప్రజలకు అధునాతన డయాగ్నస్టిక్ సౌకర్యాలు లభ్యమవుతాయని డాక్టర్ జీఎస్‌కే వేలు అన్నారు.
కాగా, విజయ మెడికల్ సెంటర్ 1985లో స్థాపించబడింది. విశాఖపట్నంలోని హెల్త్ సిటీలో ఉన్న ఈ సెంటర్ 1,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో భారతదేశంలోని అతిపెద్ద స్వతంత్ర మెడికల్ సెంటర్లలో ఒకటిగా కొనసాగుతోంది. పాథాలజీ, రేడియాలజీ, మాలిక్యులర్ ఇమేజింగ్, ప్రివెంటివ్ వెల్‌నెస్ సేవలను ఒకే చోట అందిస్తుంది.






