ఉద్యోగులకు 11 రోజుల మెంటల్ హెల్త్ బ్రేక్.. 'మీషో' ప్రకటన

by Disha Web Desk 6 |
ఉద్యోగులకు 11 రోజుల మెంటల్ హెల్త్ బ్రేక్.. మీషో ప్రకటన
X

దిశ, ఫీచర్స్ : ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ 'మీషో' ఉద్యోగుల శ్రేయస్సు కోసం 11 రోజుల 'రీసెట్ అండ్ రీచార్జ్' ప్రకటించింది. ఎంప్లాయ్స్ ఆరోగ్యానికి ప్రాధానత్యనిచ్చే క్రమంలో బెంగళూరుకు చెందిన ఈ ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్.. ప్రస్తుత పండుగ సీజన్ రద్దీ తగ్గిన తర్వాత ఎంప్లాయిస్ అందరికీ ఈ సెలవులను అమలుచేయనుంది. అక్టోబర్ 22, 2022 నుంచి నవంబర్ 1, 2022 వరకు ఈ వెసులుబాటును ఉపయోగించవచ్చు. కాగా గతేడాది కూడా 'మీషో' ఇదేవిధమైన చొరవతో ప్రశంసలు అందుకుంది.

'ప్రస్తుతం వర్క్ ప్లేస్‌లో బర్న్‌అవుట్, యాంగ్జయిటీ వంటి ఆందోళనలు ప్రధానంగా ఉద్భవిస్తున్నందున 'రీసెట్ అండ్ రీచార్జ్' అనేది 'ఎంప్లాయ్-ఫస్ట్ ప్రాక్టీసెస్' అవలంబించేందుకు ఇతర కంపెనీలకు కూడా మార్గాన్ని చూపుతుంది' అని మీషో అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కాగా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ యునికార్న్ స్టార్టప్ ఫౌండర్ & చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజీవ్ బర్న్‌వాల్.. ట్విట్టర్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేకాదు కార్పొరేట్ ముసుగులను తొలగించి చూస్తే ఇది ఉత్తమంగా కనిపిస్తుందన్నారు. ఇక 'రీసెట్ అండ్ రీచార్జ్‌' ద్వారా సంప్రదాయ కార్యాలయ నిబంధనలను పునర్నిర్వచించడాన్ని కొనసాగిస్తాం' అని మీషో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇటువంటి ప్రగతిశీల విధానాలు ఉద్యోగి కేంద్రీకరణతో పాటు ఇండస్ట్రీలో వారి నిలుపుదల రేట్లను పెంపొందించడంలో సాయపడతాయని కంపెనీ హెచ్‌ఆర్ వెల్లడించారు. 2015లో స్థాపించబడిన ఈ సంస్థ.. గతంలో 'బౌండరీలెస్' వర్క్‌ప్లేస్ మోడల్‌ సహా అవసరమైనన్ని వెల్‌నెస్, జెండర్-న్యూట్రల్ పేరెంటల్ లీవ్స్ కల్పించడంలో ముందుంది.

ఇవి కూడా చ‌ద‌వండి: సేతు బంధాసనం వలన కలిగే ప్రయోజనాలు


Next Story

Most Viewed