మొదటి సంభోగమే మరణశిక్ష..? ఆ జీవులు ఎందుకు చనిపోతున్నాయి?

by Disha Web Desk 10 |
మొదటి సంభోగమే మరణశిక్ష..? ఆ జీవులు ఎందుకు చనిపోతున్నాయి?
X

దిశ, ఫీచర్స్ : ఆస్ట్రేలియా న్యూ గినియాకు చెందిన మాంసాహార మార్సుపియల్స్ ఫస్ట్ మేటింగ్ తర్వాతే చనిపోతుంటాయి. కంగారూల జాతికి చెందిన ఈ జంతువులు.. మొదటి సంతానోత్పత్తి కాలం తర్వాత మరణించబడం ఇన్నాళ్లుగా అబ్బురపరుస్తూనే ఉంది. కాగా దీనిపై పరిశోధించిన శాస్త్రవేత్తలు లైంగిక ఉన్మాదమే మగ క్వోల్స్‌కు మరణశిక్షగా మారుతుందన్నారు. ఆడ క్వోల్స్‌తో జతకట్టే క్రమంలో విశ్రాంతి కూడా తీసుకోవని.. అశాంతి, సంభోగ ఉన్మాదం ఇందుకు కారణమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది ఇప్పటికే అంతరించిపోతున్న వాటి మనుగడకు ముప్పుగా మారుతుందన్నారు.

పరిశోధనను నిర్వహించడానికి ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీ తీరంలో ఉన్న గ్రూట్ ఐలాండ్‌లో ఏడు మగ, ఆరు ఆడ క్వోల్‌లకు ట్రాకింగ్ పరికరాలతో కూడిన చిన్న బ్యాక్‌ప్యాక్‌లను కట్టారు. ఈ ట్రాకింగ్ పరికరాల నుంచి పొందిన 42 రోజుల డేటాను విశ్లేషించిన పరిశోధకులు.. సంతానోత్పత్తి కాలం, సంతానోత్పత్తి కాని కాలం రెండు సీజన్స్‌లోనూ ఆడ జీవుల కంటే మగ జీవులు చాలా చురుకుగా ఉన్నట్లు కనుగొన్నారు. కానీ మేల్ క్వోల్స్ మొదటి సంతానోత్పత్తి కాలం వరకు మాత్రమే జీవించి ఉన్నప్పటికీ, ఫిమేల్ క్వోల్స్ నాలుగు సీజన్ల వరకు జీవించగలిగాయి. ఇక మగ, ఆడ క్వోల్స్ తీసుకునే విశ్రాంతి స్థాయి కూడా గణనీయమైన తేడాతో ఉంది. ఫిమేల్ క్వోల్స్ దాదాపు 24 శాతం సమయం విశ్రాంతి తీసుకుంటే, మేల్ క్వోల్స్ కేవలం 7 శాతం మాత్రమే రిలాక్స్ అవుతున్నాయి. మేల్ యానిమల్స్ నిద్రపోతున్నట్లు ఎక్కడా కనిపించలేదు.

Next Story

Most Viewed