- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral News: దారుణం.. బిడ్డ తెల్లగా పుట్టాడని భర్త అనుమానం.. మానసిక వేధింపులకు గురైన భార్య ఆత్మహత్య..
Viral News: భర్త అనుమానంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : Viral News: భర్త అనుమానంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. తనకు పుట్టిన బిడ్డ తెల్లగా ఉన్నాడని భర్త అనుమానించడంతో పాటు అత్తమామలు కలిసి వేధింపులకు గురి చేయడంతో బాధపడిన యువతి ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్లినట్లయితే జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన లక్ష్మీ ప్రసన్న (29) కు సరిగ్గా రెండేళ్ల క్రితం రాంనూర్ గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తితో వివాహమైంది. వీరిద్దరూ బెంగళూరులో ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. కాగా గత ఏడాది వీరికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే బిడ్డ చర్మం రంగు తెల్లగా ఉండటంతో భర్త తిరుపతికి అనుమానం కలిగింది. తామిద్దరము చామన చాయ రంగులో ఉన్నప్పటికీ, బిడ్డ మాత్రం తెల్లగా ఎలా పుట్టాడని తన భార్యను నిరంతరం ప్రశ్నిస్తూ ఆమెను మానసికంగా వేధించేవాడని బాధితురాలి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. రోజురోజుకు వేధింపులు పెరిగిపోవడంతో బాధితురాలు లక్ష్మీప్రసన్న ఉద్యోగం సైతం వదిలేసి ఇంటి వద్ద ఉంటున్నారు.
ఇక అనుమానం మాత్రమే కాదు అదనపు కట్నపు వేధింపులు సైతం పెరగడంతో గత ఐదు రోజుల క్రితం తీవ్ర మానసిక వేదనకు గురైన లక్ష్మీ ప్రసన్న తన తల్లి గారి ఇంటికి వచ్చింది అనంతరం ఆమె తీవ్రమైన ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో అమ్మానాన్న నాకు ఇక బతకాలని లేదు నా కొడుకు జాగ్రత్త…బాబును వాళ్లకు ఇవ్వకండి అంటూ అని అద్దం పైన రాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో బాధితురాలి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు, భర్త తిరుపతి మరియు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
కొడుకు తెల్లగా, అందంగా పుట్టాడని భార్యను వేధించిన టెక్కీ.. ఉరి వేసుకొని భార్య సూసైడ్
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2025
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన లక్ష్మీ ప్రసన్న(29)కు, వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన తిరుపతికి రెండేళ్ల కిందట వివాహం అయింది
ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా… pic.twitter.com/djj8uI6J7P






