శరీరంపై 85 స్పూన్లు.. వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన 50 ఏళ్ల వ్యక్తి

by Web Desk |
శరీరంపై 85 స్పూన్లు.. వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన 50 ఏళ్ల వ్యక్తి
X

దిశ, ఫీచర్స్ : చేతులు ఉపయోగించకుండా కేవలం శరీరంతో ఏ వస్తువునైనా పట్టుకోగలరా? అంటే కష్టమే. కానీ ఇరాన్‌కు చెందిన 50 ఏళ్ల అబోల్‌ఫజల్ సాబెర్ మొఖ్తారీ మాత్రం సునాయాసంగా ఈ పని చేయగలడు. ఈ క్రమంలోనే తన శరీరంపై 85 చెంచాలను బ్యాలెన్స్ చేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బద్దలు కొట్టాడు. శరీరంపై అత్యధిక స్పూన్లను బ్యాలెన్స్ చేసిన రికార్డ్ గతంలో స్పెయిన్‌కు చెందిన మార్కోస్ రూయిజ్ సెబల్లోస్ పేరిట ఉండేది. తాజాగా ఆ రికార్డ్‌ను సాబెర్ బ్రేక్ చేశాడు. ఇక తరచూ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అనేక రకాల రికార్డ్ హోల్డర్స్ వీడియోలను షేర్ చేసే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్(GWR).. ఇటీవలే ఈ స్పూన్స్ బ్యాలెన్సింగ్ వీడియోను షేర్ చేసింది.

'నాలో దాగున్న ప్రతిభను చిన్నతనంలోనే అనుకోకుండా గమనించాను. కానీ సంవత్సరాల ప్రాక్టీస్ తర్వాత ఇందులో ప్రావీణ్యత సాధించగలిగాను. ఈ ప్రత్యేక నైపుణ్యమే ప్రస్తుతం నాకు గుర్తింపుతో పాటు ఉన్నత స్థానాన్ని అందిస్తోంది. అయితే స్పూన్లు బ్యాలెన్స్ చేస్తున్న క్రమంలో 80వ మార్కుకు చేరుకున్నప్పుడు తేమ, వేడి వాతావరణం వల్ల శరీరం నుంచి కొన్ని స్పూన్లు జారిపోయాయి. అయినా నా వంతు ప్రయత్నంతో ఫీట్ పూర్తి చేయగలిగాను. ఇతర దేశాల్లోనూ నా టాలెంట్ ప్రదర్శించాలనుంది. ఇక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ బ్రేక్ చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమ కలలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను' అని అబోల్‌ఫజల్ సాబెర్ మొఖ్తారీ చెప్పుకొచ్చాడు.




Next Story

Most Viewed