ఇంట్రెస్టింగ్ : మరణం వెనుక మళ్లీ జన్మ ఉంటుందా..హిందూ మతం ఏం చెబుతోంది?

by Disha Web Desk 8 |
ఇంట్రెస్టింగ్ : మరణం వెనుక మళ్లీ జన్మ ఉంటుందా..హిందూ మతం ఏం చెబుతోంది?
X

దిశ, ఫీచర్స్ : మరణం వెనుక జన్మ ఉంటుందా? నిజంగానే చనిపోయిన వాళ్ళు మళ్లీ జన్మిస్తారా అంటే దీనికి సమాధానం ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు అనేది వాస్తం. అయితే చనిపోయిన వారు మళ్లీ జన్మనెత్తుతారని కొందరు చెబుతుంటారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది? లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి హిందూ మతంలో ఎలాంటి నమ్మకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పునర్జన్మపై హిందువులకు నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కాదండోయ్, మనలో ఎవరైనా చిన్న వయసులో చనిపోతే ఆ వ్యక్తి మళ్లీ పుడుతారు..మీ బంధువులలో ఎవరికో ఒకరికి మళ్లీ జన్మిస్తారని చెబుతుంటారు. అంతేకాకుండా,గత జన్మలో ఎవరికైనా రుణపడి ఉంటే దానిని తీర్చుకోవడానికి మళ్లీ జన్మిస్తారని, ఆ రుణ బంధం తీర్చుకుంటారని ఇలా ఎన్నో విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే హిందూ విశ్వాసాల ప్రకారం, మరణాంతర జన్మను, ముందు జీవితంలో చేసిన పాపపుణ్యాలు నిర్ణయిస్తాయని అంటారు. హిందువులకు అంతిమ లక్ష్యం మోక్షం.. అంటే పునర్జన్మ ఉండదు. కానీ అందరికీ మోక్షము లభించదు కొందరు మాత్రమే ఆ భగవంతుడిలో ఐక్యం అవుతారని భావిస్తారు.

Next Story

Most Viewed