స్విగ్గీలో 'మ్యాచ్ ద స్కోర్' పోటీ.. వీఐపీ టికెట్లు గెలుచుకునే అవకాశం!

by Disha Web |
స్విగ్గీలో మ్యాచ్ ద స్కోర్ పోటీ.. వీఐపీ టికెట్లు గెలుచుకునే అవకాశం!
X

దిశ, ఫీచర్స్ : తాజా కూరగాయలు, పాలు, పెరుగు, నాచోస్, చిప్స్, ఆయిల్ ప్యాకెట్ వంటి నిత్యవసరాల కోసం రకరకాల ఆన్‌లైన్ స్టోర్స్‌ను వినియోగించుకుంటున్నాం. అందులో 'స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌' కూడా ఒకటి. అయితే ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో స్విగ్గీ 'మ్యాచ్ ద స్కోర్'(#MatchTheScore) అనే కాంపిటీషన్ నిర్వహిస్తోంది. ఈ కాంపిటీషన్ ఏంటీ? దీని వల్ల మనం పొందే బెన్‌ఫిట్ ఏంటో తెలుసుకుందాం.

మనం చేయాల్సిందల్లా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మొదటి ఇన్నింగ్స్ చూసి, ఆ తర్వాత 'స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌' ఆ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సమానమైన అదే విలువతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. దీంతో డిస్కౌంట్ కూపన్‌లను పొందే అవకాశంతో పాటు తదుపరి IPL మ్యాచ్‌కి 2 VIP మ్యాచ్ పాస్‌లను (విమాన టిక్కెట్లు) గెలుచుకునే అవకాశాన్ని కూడా పొందవచ్చు. మొదటి ఇన్నింగ్స్‌ పూర్తయిన రెండు గంటలలోపు ఈ ఆర్డర్‌ను చేయాలి.


ఇలా పార్టిసిపేట్ చేయాలి!

మొదటి 20 ఓవర్ల తర్వాత లేదా వారు ఆలౌట్ అయ్యే వరకు బ్యాటింగ్ చేసే జట్టు స్కోరును చూసి, ఆ స్కోరుకు తగ్గట్లు మీరు కార్ట్‌కి ఐటెమ్స్ జోడించాలి. మీ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ (అన్ని తగ్గింపులు, ప్రోమో కోడ్స్ మొదలైన వాటి తర్వాత) తుది విలువ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు స్కోర్‌కి సరిగ్గా సమానంగా ఉండేలా చూసుకోవాలి.

* ఆ తర్వాత మీరు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో @swiggy_instamartలో #MatchTheScore అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ స్క్రీన్‌షాట్‌ను తప్పనిసరిగా DM (డైరెక్ట్ మెసేజ్) చేయాలి.

* Instagram పేజీని ఫాలో చేయడం మర్చిపోవద్దు లేదా మీ ఎంట్రీ చెల్లదు.

* పై నిబంధనలను అనుసరించే మొదటి 20 మంది వినియోగదారులు రూ.100 వరకు (50% తగ్గింపు కూపన్‌) గెలుచుకునే అవకాశం ఉంటుంది. వారు తమ తదుపరి ఆర్డర్‌లో దీన్ని రెడీమ్ చేసుకోవచ్చు.

*ప్రతీ వారం అతి తక్కువ సమయ వ్యవధిలో నియమాలను అనుసరిస్తూ.. ప్రాసెస్ పూర్తి చేసిన వినియోగదారులు గ్రాండ్ ప్రైజ్ కోసం షార్ట్‌లిస్ట్‌కు ఎంపికవుతారు. వాళ్లు రెండు ఎకానమీ విమాన టిక్కెట్‌లతో పాటు రెండు VIP మ్యాచ్ పాస్‌లు గెలుచుకుంటారు.

Next Story