మైండ్ కంట్రోల్ టైపింగ్ TO సోలార్ పవర్ ల్యాప్ టాప్‌ వరకు.. 2025లో అలరించిన ఆవిష్కరణలివే..!

by Javid Pasha |   (  Updated:2025-12-27 13:25:48  IST  )

గూగుల్ హెల్త్ వంటి AI టూల్స్ ఎక్స్-రే, MRIలను విశ్లేషించి క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగా గుర్తిస్తాయి. వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

మైండ్ కంట్రోల్ టైపింగ్ TO సోలార్ పవర్ ల్యాప్ టాప్‌ వరకు.. 2025లో అలరించిన ఆవిష్కరణలివే..!
X

దిశ, ఫీచర్స్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సగం సమస్యలను అదే పరిష్కరిస్తోంది. సరికొత్త మార్పులకు కారణం అవుతోంది. ఇక ఏఐ ప్రవేశంతో కొంగ్రొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ పనులను మరింత సులభతరం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది (2025)లో ప్రపంచాన్ని ఆకట్టుకున్న అధునాతన టెక్నాలజీ ఆవిష్కరణలు ఎన్నో జరిగాయి. మైండ్ కంట్రోల్డ్ టైపింగ్ మొదలు సోలార్ పవర్డ్ ల్యాప్ టాప్‌ల వరకు చోటు చేసుకున్న సాంకేతిక పరిణామాలు సరికొత్త మార్పులకు కారణం అయ్యాయి. అలాంటి వాటిలో ఈ ఏడాదిలో కొన్ని సాంకేతిక హైలైట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

*మైండ్-కంట్రోల్డ్ టైపింగ్ : న్యూరలింక్ వంటి బ్రెయిన్ - కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ల గురించి ఈ ఏడాది ఎక్కువగా చర్చ జరిగింది. ఇవి అందుబాటులోకి వచ్చాక మానవులకు అనేక పనుల్లో మానసిక, శారీరక శ్రమ తగ్గి, సౌకర్యం పెరిగింది. ముఖ్యంగా ఈ ఇంటర్ ఫేస్‌లు ఆలోచనలను టెక్ట్స్‌గా మారుస్తుండటంవల్ల హెల్త్‌కేర్‌ సెక్టార్‌లో పక్షవాత రోగులకు కమ్యూనికేషన్‌లో సహాయపడుతున్నాయి. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్‌లు నిమిషానికి 40 క్యారెక్టర్ల(characters)వేగంతో టెక్ట్స్ టైప్ అవుతుంది. అలాగే ఇవి రెస్క్యూ సమయాల్లో డ్రోన్‌లు లేదా కమ్యూనికేషన్‌లను హ్యాండ్స్-ఫ్రీగా కంట్రోల్ చేస్తాయి.

*సోలార్- పవర్డ్ ల్యాప్‌టాప్‌లు : వీవీ సోల్ వంటి ల్యాప్‌టాప్‌లు సౌర శక్తిని ఉపయోగించుకొని వర్క్ చేస్తాయి. ఇవి వ్యవసాయం లేదా విపత్తు ప్రాంతాల్లో ఆఫ్-గ్రిడ్ డేటా సేకరణకు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు.

*లిక్విడ్ రోబోట్‌లు : మసాచు సెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ (MIT) వంటి సంస్థల లిక్విడ్ మెటల్ రోబోట్‌లు రెస్క్యూ సమయాల్లో సొరంగాలు, శిథిలాల్లోకి చొచ్చుకొని పోగల సామర్థ్యం కలిగి ఉంటున్నాయి. ఇవి బాధితులను కనుగొనడంలో, రక్షించడంలో, సమాచారం అందించడంలో సహాయపడుతున్నాయి.

*ఫ్లెక్సిబుల్ బ్యాటరీలు : సామ్‌సంగ్, స్టాన్‌ఫోర్డ్ వంటి టెక్ సంస్థలు రూపొందించిన సన్నని బ్యాటరీలు వేరబుల్ హెల్త్ మానిటర్లు, స్మార్ట్ దుస్తులకు శక్తినిస్తాయి(Powering smart clothes), రోగుల లేదా అథ్లెట్ల హెల్త్ డేటాను ట్రాక్ చేయడంలో సహాయపడుతున్నాయి.

*AI-డ్రైవన్ డయాగ్నోస్టిక్స్ : గూగుల్ హెల్త్ వంటి AI టూల్స్ ఎక్స్-రే, MRIలను విశ్లేషించి క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగా గుర్తిస్తాయి. వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

*ప్రెసిషన్ వ్యవసాయ డ్రోన్‌లు: DJI డ్రోన్‌లు పంటలను రియల్-టైమ్‌లో పర్యవేక్షిస్తాయి. నీరు, ఎరువుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసి 15% వరకు దిగుబడిని పెంచుతాయి.

* ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్: మెటా ఒరియన్ వంటి AR గ్లాసెస్ రెస్క్యూ ఆపరేషన్లలో మ్యాప్‌లు, వైటల్స్ డేటాను చూపిస్తాయి లేదా సర్జన్లకు రియల్-టైమ్ గైడెన్స్ ఇస్తాయి.

* 3D-ప్రింటెడ్ ఆర్గాన్స్: ఆర్గనోవో వంటి సంస్థల బయోప్రింటింగ్ శస్త్ర చికిత్సల సందర్భంలో ట్రాన్స్‌ప్లాంట్‌ల కోసం కణజాలాలను సృష్టిస్తుంది. కాలిన గాయాలతో ఉన్న బాధితులకోసం ఇటువంటి స్కిన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. త్వరలో కిడ్నీలు, గుండెలు వంటివి కూడా రావచ్చు అంటున్నారు నిపుణులు.

*సెల్ఫ్-హీలింగ్ మెటీరియల్స్: స్టాన్‌ఫోర్డ్ పాలిమర్లు తమను తాము రిపేర్ చేసుకుంటాయి. వ్యవసాయంలో గ్రీన్‌హౌస్ ఫిల్మ్‌లు, రెస్క్యూలో డ్యూరబుల్ గేర్లలో ఉపయోగపడతాయి.

*స్మార్ట్ ప్రోస్తెటిక్స్: ఒస్సూర్ బయోనిక్ అవయవాలు(Ossur bionic limbs)AIతో కలిసి రూపొందించడంవల్ల యూజర్ల కదలికలకు అనుగుణంగా సర్దుబాటు అవుతాయి. రోజువారీ జీవితంలో, రెస్క్యూలో రఫ్ టెరైన్‌లో నావిగేషన్‌ను అందిస్తాయి. అయితే ఈ ఆవిష్కరణలు ఇప్పటికే AI, మెటీరియల్స్, ఎనర్జీ పురోగతితో వివిధ రంగాల్లో ఉపయోగపడుతున్నాయి.

Next Story