- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Physical health : సమయం లేదంటే సమస్యలు తప్పవు.. ఫిజికల్ యాక్టివిటీస్ ముఖ్యమంటున్న నిపుణులు
టీ బ్రేక్ సమయంలోనో, లంచ్ టైమ్‌లోనో కాసేపు వాకింగ్ చేసినా చాలు. ఆ ఫిజికల్ యాక్టివిటీనే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

దిశ, ఫీచర్స్ : ఇక నుంచైనా పొద్దున్న లేవాలి. వాకింగ్‌కు వెళ్లాలి. గ్రౌండ్‌కు వెళ్లేందుకు కుదరకపోతే కనీసం ఇంటి ముందు వాకిట్లోనైనా 10 నిమిషాలు అటూ ఇటూ తిరిగాలి. వ్యాయామాలకు సమయం దొరకడం లేదని భావించే చాలా మంది ఇలా అనుకుంటుంటారు కానీ.. చేయలేకపోతారు. అయితే ఇలాంటి వారికి సైతం ఓ చక్కటి మార్గం ఉందంటున్నారు నిపుణులు. అదే మైక్రో ఎక్సర్ సైజ్( Micro exercise). ఇది కూడా రోజువారీ వ్యాయామాల్లాగే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు.
‘సమయం లేదని భావిస్తే జిమ్‌కి వెళ్లకండి. కఠినమైన వ్యాయామాలు చేయకండి. ఆఫీసులో కూర్చున్నచోటే మీ శరీరాన్ని కదిలించండి’ అంటున్నారు హెల్త్ అండ్ ఫిట్‌నెస్ నిపుణులు. టీ బ్రేక్ సమయంలోనో, లంచ్ టైమ్‌లోనో కాసేపు వాకింగ్ చేసినా చాలు. ఆ ఫిజికల్ యాక్టివిటీనే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిపుణుల ప్రకారం ఇలాంటి చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఎంతో మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి, రక్త ప్రసరణను మెరుగు పరిచి మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. దీర్ఘాయుష్షును పెంచుతాయి. అందుకే ఎక్కువ సమయంపట్టే ఎక్సర్ సైజ్‌లు చేసే సమయం మీకు లేకపోతే.. మైక్రో ఎక్సర్‌సైజ్‌లు అయినా చేయండి అంటున్నారు నిపుణులు. ఇవి శారీరక ఆరోగ్యాన్నే కాదు, ఒత్తిడి, ఆందోళనలను దూరం చేయడం ద్వారా మానసిక వికాసాన్ని సైతం కలిగిస్తాయి.






